నా కెరియర్ లో లైగర్ అత్యంత పెద్ద సినిమా అదే: విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.

 Liger Is The Biggest Movie Of My Career By Vijay Devarakonda , Vijay Devarakonda-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు.

ఈ క్రమంలోనే సమంత విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.అలాగే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాలో కూడా విజయ్ దేవరకొండ నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.

Telugu Ananya Pandey, Big Liger, Janaganamana, Liger, Puri Jagannath, Samantha,

తాజాగా ఈయన ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తన కెరియర్ లో అత్యంత పెద్ద సినిమా లైగర్ అంటూ చెప్పుకొచ్చారు.అలాగే ఈ సినిమా ఎంతో సరదాగా అందమైన ప్రేమకథా చిత్రమని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సినిమా గురించి చెబుతూ ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన లైగర్ సినిమానుదర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube