ఆచార్య ఓటీటీ అప్‌ డేట్‌... ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్‌

మెగా స్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల అయ్యి నిరాశ పర్చిన విషయం తెల్సిందే.గత నెలలో విడుదల అయిన ఆచార్య సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ అయ్యి ఎలాగూ ప్లాప్ అయ్యింది కనుక కనీసం ఓటీటీ లో అయినా త్వరగా విడుదల చేసి అభిమానులకు కాస్త రిలాక్స్ ఇచ్చేస్తారేమో అని అంతా అనుకున్నారు.

 Ram Charan Chiranjeevi Acharya Movie Ott Release News Details, Acharya, Acharya-TeluguStop.com

మెగా అభిమానులు సినిమాకు వెళ్లి చూడాలని ఉన్నా కూడా ఆర్థికంగా సినిమా ను చూసేంత వీలు లేదు.పైగా సినిమా ప్లాప్‌ టాక్ దక్కించుకుంటే ఎందుకు వేలకు వేలు ఖర్చు చేసి వెళ్లడం అనుకున్నారు.

దాంతో ఆచార్య సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఎదురు చూశారు.సినిమా నాలుగు వారాల తర్వాత విడుదల చేయాలని నిర్ణయించుకున్న ఓటీటీ వారు కాస్త ముందుగానే విడుదల చేస్తామని నిర్మాతకు విజ్ఞప్తి చేశారట.

ఆయన కూడా ఓకే అనడం.మెగాస్టార్‌ కూడా సరే అంటూ చెప్పడంతో ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా ఓటీటీ విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్‌ కాస్త ఇబ్బంది పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆచార్య సినిమా ఓటీటీ విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు మోకాళు అడ్డుతున్నారు.

Telugu Acharya, Acharya Ott, Chiranjeevi, Koratala Siva, Ott, Ram Charan-Movie

వారు భారీ మొత్తంలో నష్టపోయారు.ఇప్పటికే తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.వారు తమ కు కొంత మొత్తం అయినా నష్టపరిహారం చెల్లిస్తే ఊరట చెందే అవకాశం ఉంది.కాని తమకు సెటిల్ చేయకుండా ఓటీటీ కి ఇవ్వడం అనేది ఖచ్చితంగా తమను రెచ్చగొట్టడం అవుతుంది.

అయినా బయర్లకు ఇష్టం లేకుండా.అనుమతి లేకుండా నాలుగు వారాల ముందు ఓటీటీ స్ట్రీమింగ్‌ కు ఇచ్చే అవకాశం లేదు.

కనుక ఇప్పుడు ఆచార్య యూనిట్‌ సభ్యులు ఓటీటీ విడుదల విషయంలో ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube