బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రతి విషయాన్ని తనదైన శైలిలో నెగిటివ్ గా స్పందిస్తూ అనునిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది.
కంగనా ప్రస్తుతం రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న” ధాకడ్” అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో తెలంగాణ ప్రముఖ స్టార్ హీరోలకు దీటుగా యాక్షన్ సీన్లు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో కంగనా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఒక విలేకరి మాట్లాడుతూ నిజజీవితంలో కూడా మీది ధాకడ్ క్యారెక్టరేనా అని ప్రశ్నించాడు.
విలేకరి అడిగిన ప్రశ్నకు కంగన స్పందిస్తూ నిజ జీవితంలో ఎవరినైనా అలా కొడితే ఊరుకుంటారా? అసలైనా నిజజీవితంలో ఎవరినైనా నేనెందుకు కొడతాను? మీలాంటి వాళ్ళు నా గురించి ఇలాంటి నెగటివ్ రూమర్స్ స్ప్రెడ్ చెయ్యటం వల్లనే నాకింకా పెళ్లి కావట్లేదు.నాకూ ఇంకా పెళ్ళి కాకపోవటానికి ఇలాంటి రూమర్సే కారణం అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మరొక నటుడు అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ కంగనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నిజజీవితంలో కంగనా చాలా మంచి మనిషి.సున్నిత స్వభావం కలిగిన మనిషి.తనకి దైవభక్తి కూడా ఎక్కువ కంగనా గురించి ఇలాంటి మంచి విషయాలను కూడా మీరు స్ప్రెడ్ చేస్తే ఆమె పట్ల ప్రేక్షకులకున్న అనుమానాలు అన్ని పోతాయి…అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కంగనా నటిస్తున్న ధాకడ్ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమ పాన్ ఇండియా లెవెల్ లో మే 20 వ తేదిన విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.