మెగా స్టార్ చిరంజీవి మరియు చరణ్ కలిసి నటించిన సినిమా అవ్వడం తో ఆచార్య సినిమా కు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యి ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 125 కోట్ల వరకు చేసింది.అంతటి భారీ ప్రీ రిలీజ్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా 150 కోట్ల వసూళ్లు.200 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని ప్రతి ఒక్కరు భావించారు.కాని అనూహ్యంగా ఆచార్య సినిమా ఫలితం తారు మారు అయ్యింది.
సినిమా కనీసం 50 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక ఢీలా పడిపోయింది.
బయ్యర్లు దాదాపుగా వంద కోట్ల కు పైగా నష్ట పోవాల్సి వస్తుంది.
దాంతో ఇప్పడు బయ్యర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు సినిమా నష్టం ను భరించాల్సిందిగా మెగా స్టార్ చిరంజీవికి ఓపెన్ లెటర్ రాయడం జరిగింది.సినిమా నష్ట పోయి ప్లాప్ అయ్యి మేము ఉంటే మీరు విదేశాలకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయ్యర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవిని విమర్శిస్తున్న బయ్యర్లకు కౌంటర్ అన్నట్లుగా ఆచార్య అభిమానులు రంగంలోకి దిగారు.వారు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ సినిమా కు లాభాలు వచ్చి ఉంటే మీరు ఇచ్చే వారా అంటూ ప్రశ్నించారు.

లాభాలు వచ్చినప్పుడు తీసుకుని లాభాలు లేనప్పుడు హీరో ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ఈమద్య కాలంలో కామన్ అయ్యిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల విడుదల అయిన చరణ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కు భారీ లాభా లను బయ్యర్లు దక్కించుకున్నారు.అందులో నుండి కొంత మొత్తం ను చరణ్ కు ఏమైనా ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు.చరణ్ మరియు చిరంజీవి లను ఆచార్య లాస్ నేపథ్యం లో వారిని ప్రశ్నించే హక్కు అధికారం ఎవరికి లేదు అంటూ కొందరు మెగా అభిమానులు రివర్స్ అవుతున్నారు.
ఆ విషయానికి వస్తే నిర్మాత నిరంజన్ రెడ్డి కాని దర్శకుడు కొరటాల శివ కాని అసలు నష్టాలను భరించాల్సిన అవసరం లేదు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.