రెండు వర్గాలతో వైసీపీ అధిష్టానంకు కొత్త చిక్కులు..

వైసీపీ రాజకీయాల్లో అంతర్గత పోరు విషయంలో సీఎం జగన్ కు తలనొప్పిగా మారుతుంది.అయితే ఏపీలో వైసీపీలో వర్గ పోరు తార స్థాయికి చేరింది.

 Ycp Leaders Heated Arguments Chirala Municipal Meeting, Chirala Municipal Meetin-TeluguStop.com

అందులోనూ పార్టీలో రాకముందు నుంచే స్ధానిక నేత ఆమంచితో తలపడుతున్న కరణం బలరాం వైసీపీకి మద్దతు ప్రకటించాక కూడా అదే జోరు కొనసాగిస్తుండటం వైసీపీకి సమస్యగా మారుతోంది.

ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను త్వరలో వైసీపీలోకి చేర్చుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో చీరాల నియోజకవర్గంలో అంతర్గత పోరు అధిష్టానానిని తలనొప్పిగా మారుతోంది.

అందులోనూ పార్టీలో రాకముందు నుంచే స్ధానిక నేత ఆమంచితో తలపడుతున్న కరణం బలరాం వైసీపీకి మద్దతు ప్రకటించాక కూడా అదే జోరు కొనసాగిస్తుండటం వైసీపీకి సమస్యగా మారుతోంది.చీరాల వైసీపీలో వర్గ పోరు పతాక స్థాయికి చేరింది.

మాజీ ఎమ్మెల్యే ఆమంచి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గెలిచిన కరణం బలరాం ఆ తరువాత వైసీపీకి మద్దతుగా నిలిచారు.

ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతూనే ఉంది.

Telugu Ap Cm Ys Jagan, Chirala, Ycp-Political

ఇప్పుడు చీరాల మున్సిపల్ సమావేశంలోనూ వైసీపీ కౌన్సిలర్లు ఇద్దరి మద్దతు దారులుగా.రెండు వర్గాలుగా విడిపోయి బాహా బాహీకి దిగారు.దీంతో.

మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది.ఆమంచి వర్గం కౌన్సిలర్లు పార్టీ గుర్తుపై గెలవలేదంటూ.

తామే వైసీపీ తరపున గెలిచామని కరణం వర్గం కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు.ఆమంచి వర్గం కౌన్సిలర్లు చైర్మన్ పోడియం దగ్గర బైఠాయించారు.

ఆమంచి వర్గ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి మీరు టిడిపికు ఓట్లు వేసి వచ్చారంటూ వ్యాఖ్యానించారు.ఈ సమయంలో రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది.

ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు.పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఆ మంచి వర్గ కౌన్సిలర్లు చైర్మన్ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, కౌన్సిల్ సభ్యులను దూషించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలంటూ చైర్మన్ పోడియం ముందు కరణం వర్గ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.ఈ క్రమంలోనే చైర్మన్‌, సభ పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ.

ఆమంచి వర్గం కౌన్సిలర్లు సత్యనందం, సురేష్‌పై చైర్మన్ శ్రీనివాసరావు 6 నెలల పాటు సస్పెండ్ వేటు చేశారు.

గతంలోనే ఇదే రకమైన వివాదంతో కౌన్సిల్ సమావేశం లో గందరగోళం చోటు చేసుకుంది.

రెండు వర్గాలు ఒకే పార్టీలో కొనసాగుతున్నా.సమన్వయం లేకపోవటమే ఈ పరిస్థితికి కారణంగా స్థానిక నేతలు చెబుతున్నారు.

పార్టీ అధినాయకత్వం సైతం వీరి మధ్య సయోధ్య దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఇక, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ప్రస్తుతం అక్కడ పార్టీ సమన్వయకర్తగా ఉండటంతో.

అక్కడ నేతల మధ్య సయోధ్యకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube