అమెరికాలో కరోనా మహమ్మారి మరో సారి కోరలు చాస్తోందా, కరోనా మొదటి వేవ్ రోజులు మళ్ళీ రానున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు.అయితే ఈసారి కరోనా ప్రభావం చిన్న పిల్లలపై ఎక్కువగా చూపుతోందని, అమెరికాలో ఈ మధ్య కాలంలో నమోదైన కేసుల్లో అత్యధిక శాతం చిన్నపిల్లలవే నమోదైనాయని తెలుస్తోంది.
అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ చిల్డ్రన్ హాస్పటల్ అసోసియేషన్ రెండూ కలిసి అమెరికాలో పిల్లలపై కరోన ప్రభావం అనే అధ్యయనంలో సంచలన విషయాలను వెల్లడించారు.
కరోనా మొదలైన నాటి నుంచీ నేటి వరకూ అమెరికా వ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా పిల్లలు కరోనా బారిన పడ్డారని ఈ అధ్యయనం తెలిపింది.
అయితే మొదట్లో ఈ వైరస్ పిల్లలపై ప్రభావం చూపకపోయిన ప్రస్తుతం ఊహకి అందనంతగా పిల్లలపై కరోనా ప్రభావం చూపుతోందని అధ్యయనంలో తెలిపారు.గడిచిన నెలలో సుమారు 1.24 లక్షల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని అమెరికాలో బయటపడుతున్న రెండు కొత్త వేరియంట్స్ కారణంగానే పిల్లలలో ఎక్కువ కేసులు వస్తున్నాయని పిల్లల తల్లి తండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే పిల్లలపై ఈ కరోనా ప్రభావం చూపించినా మళ్ళీ తగ్గుముఖం పడుతుందని అయితే దీర్ఘకాలికంగా ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పిల్లల విషయంలో తల్లి తండ్రులు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.కాగా గడిచిన వారం రోజుల్లో అమెరికాలో సుమారు 37 వేల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారట.ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా చిన్న పిల్లలలకు కరోనా వ్యాక్సిన్లు వేస్తుండగా ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేయించని పిల్లలకు తప్పనిసరి వ్యాక్సినేషన్ చేయించాలని అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది.