తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు...ఎందుకంటే..??

ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అమ్మ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అనే చెప్పాలి.

 Brave Hen Fight With Eagle To Save Her Children Viral Video Details, Viral Lates-TeluguStop.com

రీసెంట్ గా కన్నడ సూపర్‌స్టార్‌ యష్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘కెజిఎఫ్‌’ లో కూడా అమ్మ గొప్పతనంను ఎంతో గొప్పగా వివరించారు.ఈ సినిమాలో అమ్మ గురించి చెప్పిన ఒక్కో డైలాగ్ అందరి మనసులలో అలాగే నిలిచిపోతుంది.

ముఖ్యంగా ఈ సినిమాలోని ‘తల్లిని మించిన గొప్ప యోధులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు’ అంటూ యష్ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

మనల్ని నవమాసాలు మోసి కని పెంచిన తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.

తన పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి మనసు ఎంతగానో అల్లాడిపోతుంది.ఐతే మనుషులలోనైనా, జంతువులలోనైనా, పక్షులలోనైనా సరే అమ్మ ప్రేమ సమానమే అని చెప్పడానికి ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.

ఈ వీడియో చూస్తే అమ్మ అంటే ఏంటో మీకు అర్ధం అవుతుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది

ఈ వైరల్ వీడియోలో ఓ కోడి తన పిల్లలతో కలిసి ఒకచోట మేత మేస్తూ ఉంటుంది.

సరిగ్గా ఆ సమయంలోనే ఎక్కడ నుండి వచ్చిందో గాని ఒక డేగ ఆకాశం నుంచి దూసుకొచ్చి ఆ కోడి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది.అది గమనించిన తల్లి కోడి తన పిల్లలను కాపాడుకోవాలని ఆ డేగపై మెరుపుదాడి చేసింది.డేగతో భయంకరంగా తలపడింది.ఆ కోడిని చూసి డేగ హడలెత్తిపోయి బిక్కు బిక్కుమంటూ ఓ మూలన దాక్కుంది.నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను ఖబర్ధార్ అంటూ ఒక రేంజ్ లో డేగను బయపెట్టి తరువాత తిరిగి తన పిల్లల వద్దకు వెళ్లిపోయింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు “అమ్మ అంటే అది రా.అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube