తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు...ఎందుకంటే..??

తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు…ఎందుకంటే??

ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు…ఎందుకంటే??

అమ్మ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అనే చెప్పాలి.రీసెంట్ గా కన్నడ సూపర్‌స్టార్‌ యష్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'కెజిఎఫ్‌' లో కూడా అమ్మ గొప్పతనంను ఎంతో గొప్పగా వివరించారు.

తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు…ఎందుకంటే??

ఈ సినిమాలో అమ్మ గురించి చెప్పిన ఒక్కో డైలాగ్ అందరి మనసులలో అలాగే నిలిచిపోతుంది.

ముఖ్యంగా ఈ సినిమాలోని 'తల్లిని మించిన గొప్ప యోధులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు' అంటూ యష్ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

మనల్ని నవమాసాలు మోసి కని పెంచిన తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.

తన పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి మనసు ఎంతగానో అల్లాడిపోతుంది.

ఐతే మనుషులలోనైనా, జంతువులలోనైనా, పక్షులలోనైనా సరే అమ్మ ప్రేమ సమానమే అని చెప్పడానికి ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.

ఈ వీడియో చూస్తే అమ్మ అంటే ఏంటో మీకు అర్ధం అవుతుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ వైరల్ వీడియోలో ఓ కోడి తన పిల్లలతో కలిసి ఒకచోట మేత మేస్తూ ఉంటుంది.

"""/"/సరిగ్గా ఆ సమయంలోనే ఎక్కడ నుండి వచ్చిందో గాని ఒక డేగ ఆకాశం నుంచి దూసుకొచ్చి ఆ కోడి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది.

అది గమనించిన తల్లి కోడి తన పిల్లలను కాపాడుకోవాలని ఆ డేగపై మెరుపుదాడి చేసింది.

డేగతో భయంకరంగా తలపడింది.ఆ కోడిని చూసి డేగ హడలెత్తిపోయి బిక్కు బిక్కుమంటూ ఓ మూలన దాక్కుంది.

నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను ఖబర్ధార్ అంటూ ఒక రేంజ్ లో డేగను బయపెట్టి తరువాత తిరిగి తన పిల్లల వద్దకు వెళ్లిపోయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు "అమ్మ అంటే అది రా.అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

రాజ్ తరుణ్ ను వదిలేయాలని అన్ని లక్షల ఆఫర్.. లావణ్య సంచలన వ్యాఖ్యలు వైరల్!