అయ్యయ్యో.. నోరు జారాడే.. చిరు 154 టైటిల్ లీక్ చేసేసిన శేఖర్ మాస్టర్?

టాలీవుడ్ ప్రేక్షకులకు డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇప్పటికే ఎన్నో సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేసి, సినిమాలకు అద్భుతమైన స్టెప్పులను అందించాడు.

 Sekhar Master Reveals Chiranjeevi Bobby Movie Title, Sekhar Master, Chiranjeevi,-TeluguStop.com

అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉన్నాడు.ఇకపోతే దర్శకుడు కొరటాల శివ తాజాగా దర్శకత్వం వహించిన ఆచార్య సినిమాలో నుంచి తాజాగా భలే భలే బంజారా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే.

ఈ పాట స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ స్టెప్పులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కీ ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మొదలవుతున్నాయి.

ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసిన సమయంలో జరిగిన ఘటనల గురించి,అదేవిధంగా చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.ఇంటర్వ్యూ లో భాగంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఒక మ్యాటర్ ను అనుకోకుండా లీక్ చేసేసాడు.

Telugu Bobby, Chiranjeevi, Ram Charan, Sekhar Master, Tollywood-Movie

చిరంజీవి, బాబి కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఆ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.కానీ ఆ టైటిల్ మరి ఓల్డ్ గా ఉందని, ఇంకొకటి అయితే ట్రై చేస్తున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి.అయితే శేఖర్ మాస్టర్ తాజాగా ఆ టైటిల్ ని కన్ఫర్మ్ చేశాడు.

ఆ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు చెప్పేశాడు.అంతేకాకుండా ఆ సినిమాలో ఒక పాట కంపోజ్ చేస్తానని కూడా తెలిపారు.

ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాను అని తెలిపాడు.అయితే శేఖర్ మాస్టర్ టైటిల్ ను లీక్ చేయడంతో ఒక్కసారిగా చిత్రబృందం నిరుత్సాహ పడినట్లు తెలుస్తోంది.

సినిమా టైటిల్ ను ఎంతో ఆర్భాటంగా గ్రాండ్ గా ప్రకటిస్తాం అని చిత్రబృందం భావించారెమో.కానీ శేఖర్ మాస్టర్ తనకు తెలియకుండా టైటిల్ ను బయటపెట్టి కొంప ముంచేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube