క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్టే కనిపించిన మాస్ మహారాజా రవితేజ మొన్నటికి మొన్న వచ్చిన ఖిలాడి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు.క్రాక్ బ్లాక్బస్టర్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
ఇక ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయగా అక్కడ కూడా ఇలాంటి నిరాశే మిగిలింది.అయితేనేం థియేట్రికల్ బిజినెస్ పరంగా మాత్రం కిలాడీ రవితేజ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
అయితే గత కొంత కాలం నుంచి రవితేజకు నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా బాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది.
అయితే ఈ విషయాన్ని అటు మాస్ మహారాజా మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు అని తెలుస్తోంది.
అన్నీ తెలిసి కూడా మళ్లీ మళ్లీ ఓకే తప్పు చేస్తున్నాడు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.సాధారణంగా రవితేజ సినిమాలు బాలీవుడ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ కి మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉంది.
కానీ థియేట్రికల్ బిజినెస్ ఊహించిన విధంగా జరగడం లేదు.అయితే ఇక ఈ విషయాన్ని పట్టించుకోని మాస్ మహారాజా తన సినిమాలను హిందీలో థియేట్రికల్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన సినిమాలను తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయాలని నిర్మాతలను ఒత్తిడి పెడుతున్నాడట రవితేజ.

ఇక హీరో ఒత్తిడితోపాటు నిర్మాతలు కూడా ఈ డిమాండ్కు అంగీకరిస్తున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
వీటితో పాటు మరో మూడు చిత్రాలు కూడా లైన్ లో పెట్టాడు.సుధీర్ వర్మతో రావణాసుర, త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో ధమాకా చిత్రాలు చేస్తున్నాడు.

ఇక స్టువర్టుపురం దొంగ జీవిత కథ ఆధారంగా టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమా కూడా మొదలు పెట్టాడు మాస్ మహారాజా. అయితే ఈ సినిమాలో అన్నింటినీ కూడా తెలుగుతో పాటు హిందీ లో థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారట రవితేజ.కానీ అటు నిర్మాతలు మాత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా ఉండడంతో ఇక కాస్త ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఖిలాడి ఫలితం తెలిసి కూడా రవితేజ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్న మాట.







