ప్రస్తుతం ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్ ను కోట్లాది మంది ప్రజలు క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారు.ముఖ్యంగా ట్విట్టర్ చాలా మంది జీవితాలను సులభతరం చేస్తూ వారి లైఫ్ లో ఒక అంతర్భాగమైంది.
ఇది తన యూజర్లకు మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను విడుదల చేస్తాయి.ఇందులో భాగంగా మరొక సరికొత్త ఫీచర్ ను ట్విట్టర్ మన ముందుకు త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తోంది.
ఆ ఫీచర్ ఏంటి… ఎలా యూజర్లకు ఉపయోగపడుతుందో అనే విషయాలు తెలుసుకుందాం.
ట్విట్టర్ లో త్వరలోనే ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఎడిట్ ఫీచర్ కోసం ఆతృతగా యూజర్లు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నారు.యూజర్ల ఆసక్తిని గమనించిన ట్విట్టర్ కూడా వీలయినంత తొందరగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఈ క్రమంలోనే ట్విట్టర్ లో రాబోతున్న ఎడిట్ ఫీచర్ పనితీరు గురించి టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ జాన్ మాన్‌చున్ వాంగ్ ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టారు.

మాన్‌చున్ వాంగ్ ప్రకారం, ట్వీట్‌లో ఏమైనా మార్పులు చేసినప్పుడు సవరించిన ఆ మార్పులతో కొత్త ట్వీట్ క్రియేట్ అవుతుంది.కానీ ఎడిట్ చేసిన ట్వీట్ అనేది మారకుండా అలాగే ఉంటుంది.కొత్త ట్వీట్ పాత ట్వీట్ తో కలిపి యూజర్ ప్రొఫైల్‌లో టాప్‌లో కనిపిస్తుంది.
ప్రస్తుతం ట్విటర్ కొత్తగా తీసుకొస్తున్న ఈ సరికొత్త ఎడిట్ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందని ఇంతముందే ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది.