ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత ఆ స్థానం సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఇంతకీ బన్నీ తరాత స్థానం ఎక్కడ అంటే ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లో అని తెలుస్తుంది.
సోషల్ మీడియాలో తన క్రేజీ అప్డేట్స్ తో తన రౌడీ ఫ్యాన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రాం లో 15 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయ్యాడు.ఇప్పటివరకు సౌత్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారు.
ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ వచ్చాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రాం లో 18 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకెళ్తున్నాడు.
ఆ తర్వాత ప్లేస్ లో విజయ్ దేవరకొండ 15 మిలియన్ ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్నాడు.ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో రాబోతున్నాడు.
పూరీ జగన్నాథ్ మార్క్ టేకింగ్ తో రౌడీ స్టార్ లైగర్ గా అదరగొట్టనున్నారు.ఈ సినిమాతో విజయ్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
లైగర్ తర్వాత మళ్లీ పూరీతోనే జన గణ మన సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.