ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీస్తే హిట్టు కొట్టడం ఖాయమని దర్శక నిర్మాతలు నమ్మేవారు.హిట్ కొట్టకపోయినా కాస్తయినా లాభాలు మాత్రం పొందేందుకు అవకాశం ఉంటుంది.
కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేక్షకుల పంథా పూర్తిగా మారిపోయింది.స్టార్ హీరోలతో సినిమాలు చేసిన హిట్టు కొట్టొచ్చు అన్న నమ్మకం మాత్రం ఉండడం లేదు.
ఎందుకంటే కథ బలంగా ఉంటేనే అటు స్టార్ హీరో హీరోయిన్ల సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.దీంతో ఇలా ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు తీసి భారీ అంచనాల మధ్య విడుదల చేసి హిట్ కొట్టాలి అనుకున్న దర్శకులకు నిరాశే ఎదురైంది.
ఇలా స్టార్ హీరోలతో ఫ్లాప్ చవిచూసిన దర్శకులు ఎవరో తెలుసుకుందాం.
బాహుబలి లాంటి వరల్డ్వైడ్ హిట్ తర్వాత ప్రభాస్ వెంటనే నటించిన చిత్రం సాహో.
డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పూర్తిగా నిరాశపరిచింది.అయితే అటు నార్త్ లో మాత్రం సత్తా చాటింది అని చెప్పాలి.
సినిమా యావరేజ్ టాక్ తర్వాత సుజిత్ మరో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ల లేకపోయాడు.ఇక సుజిత్ సినిమా ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేణు శ్రీరామ్.ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది అనుకున్న ఐకాన్ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
ఇక ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కాల్సి ఉంది.

ఈ సినిమా ఉంటుందో లేదో కూడా ప్రస్తుతం క్లారిటీ లేకుండా పోయింది.ఇక రాధా కృష్ణ కుమార్ రెండో సినిమాకే ప్రభాస్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.మూడేళ్లు భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్ చివరకు నిరాశ పరిచింది.దీంతో రాధా కృష్ణ కుమార్ తర్వాత సినిమాపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది.

ఇక వెంకటేష్ తో నారప్ప సినిమా తీసి మంచి హిట్టు అందుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇప్పటివరకు మరో సినిమా వైపు చూడక పోవడం గమనార్హం.మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వంశీపైడిపల్లి సైతం మరో సినిమా పట్టాలెక్కించ లేకపోయాడు.ఇలా ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి చివరికి ఫ్లాప్ చూసిన దర్శకులు ఆ తర్వాత మాత్రం మరో సినిమాకి ఊహించని రేంజ్ లో గ్యాప్ తీసుకుంటున్నారు అని చెప్పాలీ.