అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎవరైనా సరే ఆస్పత్రికి పరుగులు తీస్తారు.తమ సమస్యను చెప్పుకుని తగిన మందులు వాడతారు.
నయమయ్యే వరకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు.అయితే డాక్టర్‌ను సంప్రదించినపుడు పరీక్షించి వాడాల్సిన మందుల వివరాలు చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారు.
అది మెడికల్ షాప్ వారికి చూపిస్తే దానికనుగుణంగా మందులు ఇస్తారు.వాటిని వాడి ఆరోగ్యాన్ని కుదుట పర్చుకుంటాం.
ఇదంతా సాధారణ విషయమే.అయితే ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
వైద్యులందరూ ఒకేలా రాయరు.ఒక్కొక్కరు ఒక్కో రాతతో రాస్తుంటారు.
ఆ రాతలు ఎవరికీ అర్థంకావు.మెడికల్ షాపు వారు కూడా తడబడుతుంటారు.
చివరికి సదరు డాక్టర్ పరిధి మెడికల్ షాపు వారు అయితే సరిగా ఇస్తారు.మనం వారి రాతలను తెలుసుకుందామనుకున్నా.
మందుల వివరాలు ఎంటో కనుకుందామనుకున్నా కుదరదు.కొన్ని సందర్భాల్లో మెడికల్ షాపు వారు డాక్టర్ రాసిన మందులకు బదులు వేరే మందులు ఇస్తుంటారు.
దీంతో ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.ఇలాంటి ఘటనే తాజాగా కడప జిల్లాలో చోటుచేసుకుంది.
వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ అర్థంకాక ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు ఎక్కువ డోస్ ఉన్న మందులు ఇచ్చాడు.అవి వాడిన బాధితురాలికి ఆరోగ్యం మొత్తం క్షీణించింది.చివరకు మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది.అయితే మృతి వెనుక విషయాలు తెలుసుకున్న మృతురాలి బంధువులు షాక్ అయి… కోపోద్రిక్తులై సదరు మెడికల్ షాపుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అసలు నిజాలు వెలుగులోకొచ్చాయి.
కడప జిల్లా రాజంపేటలోని ఎర్రబల్లి ప్రాంతంలో ఈ విషాధ ఘటన జరిగింది.

ఎర్రబల్లికి చెందిన సుబ్బ నరసమ్మకు ఆరోగ్యం బాగోలేదు.దీంతో గతేడాది డిసెంబర్‌లో కడపలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించుకుంది.కాగా సదరు వైద్యులు థైరాయిడ్ సమస్య ఉందని మందులు రాసిచ్చారు.సదరు వృద్ధురాలి కుమారుడు సుధాకరాచారి డాక్టర్ రాసిచ్చిన చిట్టీని తీసుకుని ఓ మెడికల్ షాపుకు వెళ్లి మందులు తీసుకున్నాడు.
ఆ మందులు వాడినా నయం కాకపోగా ఆరోగ్యం మరింత క్షీణించింది.అనుమానించిన కుటుంబీకులు మళ్లీ వైద్యుడిని కలిసి ఆరా తీశారు.యాంటీ ధైరాక్సిన్ 10ఎంజీ రాసిస్తే థైరాక్సిన్ సోడియం 100 ఎంజీ మందులు వాడారని తెలుసుకున్నారు.ఇదే విషయమై గత నెల 24న రాజంపేట పట్టణ పోలిస్‌స్టేషన్‌లో సదరు మెడికల్ షాప్‌పై ఫిర్యాదు చేశారు.
అనంతరం వృద్దురాలిని నెల్లూరులోని ఓ ఆప్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి ఈ నెల5న మృతిచెందింది.ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యప్తు చేపట్టారు.