స్పీడ్‌గా వస్తున్న లారీ వైపు దూసు కెళ్లిన చిన్నారి.. వెంట్రుక వాసిలో కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

రోడ్ సేఫ్టీ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం అత్యాశకం.ముఖ్యంగా పెద్ద వారు తమ చిన్న పిల్లలకు రోడ్లను ఎలా దాటాలో నేర్పించాలి.

 A Child Leaning Towards A Lorry Coming At Speed The Mansaved Viral Latest, Viral-TeluguStop.com

అలాగే వాహనాలు వస్తున్నప్పుడు రోడ్లు క్రాస్ చేయకూడదని అర్థం అయ్యేలా చెప్పాలి.లేదంటే చిన్నపిల్లలు రోడ్లపై ప్రమాదాలకు గురయ్యే అవకాశముంది.

తాజాగా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోందో వీడియో.ఈ వీడియోలో ఒక చిన్నారి రోడ్ల పైన చాలా వేగంగా వాహనాలు వెళ్తుండగా క్రాస్ చేయాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో అటువైపు నుంచి స్పీడ్ గా ఒక లారీ దూసు కొచ్చింది.సరిగ్గా దాని కింద పడబోయాడు ఆ చిన్నారి! అయితే దీన్ని గమనించిన ఒక వ్యక్తి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకొచ్చి చిన్నారిని వెనక్కి లాగాడు.

దీంతో ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక బిజీ రోడ్డులో వెహికల్స్ శరవేగంగా వెళ్తున్నట్లు గమనించ వచ్చు.అయితే ఇలాంటి రోడ్డు దాటడానికి ఒక యువతి స్కూటర్ పై ఉండటం గమనించవచ్చు.

ఆమె పక్కనే రోడ్డు క్రాస్ చేయడానికి ఒక చిన్న పిల్లాడు నిల్చొని ఉండటం కూడా చూడొచ్చు.అయితే ఈ చిన్న పిల్లోడు రోడ్లపై వాహనాలు వేగంగా వెళ్తున్నప్పటికీ దాన్ని క్రాస్ చేయాలను కున్నాడు.

అలా అనుకొని వేగంగా పరిగెత్తాడు.

అయితే ఇది గమనించిన ఒక వ్యక్తి యమ స్పీడుగా పరిగెత్తి  చిన్నారి చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు.ఆ చిన్నారి ఎంత వేగంగా వెళుతున్నాడంటే.ఆ వ్యక్తి ఆ చిన్నరి చేతిని పట్టుకుంటే గాల్లో లేసాడు.

ఆ క్రమంలోనే ఒక లారీ ట్రక్ ఆ బాలుడిని ఢీ కొట్టడానికి ముందు కొచ్చింది.పిల్లాడికి ఆ ట్రక్ కు వెంట్రుక వాసి మందం గ్యాప్ మాత్రమే ఉంది.

ఒకవేళ ఆ వ్యక్తి చాక చక్యంగా ఈ పిల్లోడిని కాపాడక పోతే ఇప్పటికే పెద్ద ప్రమాదం జరిగిపోయేది.ఆ చిన్నారికి భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టే తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించు కున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.దీన్ని చూసిన నెటిజనులు షాక్ అవుతున్నారు.

ఒక్క సెకన్ పాటు తన గుండె ఆగిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.రక్షించిన వ్యక్తి దేవుడని పొగుడుతున్నారు.

ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.