ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోంకు అప్పటి నుంచి ముగింపు.. ఇక ఆఫీసులకు టెకీలు..

కరోనా.ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలా కుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 It Employees' Work From Home Is Over From Then On And Techies For Offices , It-TeluguStop.com

ఈ మహమ్మారి వలన ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు.ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయారు.

ఇంకా నష్టపోతూనే ఉన్నారు.ఐటీ ఉద్యోగులు కరోనా మహమ్మారి వలన వర్క్ ఫ్రం హోం చేయాల్సి వచ్చింది.

ఒకటి కాదు రెండు కాదు దాదాపు 24 నెలల నుంచి టెకీలు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పని చేస్తున్నారు.కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మెసేజీలు పంపాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అందరూ ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు సూచించాయి.కానీ అందులో కూడా ఐటీ కంపెనీలు ఒక షరతును విధించాయి.

ఏప్రిల్ 1 నుంచి ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మెసేజీలను పంపాయి.కానీ అందరూ ఒకే సారి రాకుండా ప్రాజెక్టుకు సంబంధించిన కొంత మంది మాత్రమే వారంలో ఆఫీసుకు రావాలని చెప్పాయి.

దీంతో ఐటీ ఉద్యోగులు తొలుత వారానికి 2 నుంచి 3 రోజుల పాటు మాత్రమే ఆఫీసులకు వెళ్లనున్నారు.తర్వాత మెల్లగా ఈ సంఖ్యను పెంచాలని పలు ఐటీ కంపెనీలు చూస్తున్నాయి.

ఏదేమైనా కానీ ఐటీ కంపెనీల ఉద్యోగులు రెండు సంవత్సరాలుగా చేస్తున్న వర్క్ ఫ్రం హోం సౌలభ్యానికి ఇక తెరదించాలని పలు ఐటీ కంపెనీలు చూస్తున్నాయి.టెకీలు ఆఫీసులకు వస్తే ఐటీ రంగం మీద ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్న చాలా మంది అసంఘటిత రంగ కార్మికులు తిరిగి ఉపాధి పొందే అవకాశం ఉంది.

ఈ ఆంశం మీద ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి కనుక టెకీలు ఆఫీసులకు వస్తేనే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు.

IT Employees' Work From Home Is Over From Then On And Techies For Offices , It, Jobers - Telugu Hyderabad, Employees

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube