వాషింగ్టన్‌లోని డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని బ్యాగేజ్ బెల్ట్ సమీపంలో వీల్‌చైర్‌లో అచేతనంగా పడివున్న 54 ఏళ్ల భారతీయ మహిళను అత్యవసర వైద్య సిబ్బంది సకాలంలో రక్షించి వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనను విమానాశ్రయ అధికారులు భయంకరమైనదిగా అభివర్ణించారు.
కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు మంగళవారం మాట్లాడుతూ.బాధితురాలికి అమెరికా శాశ్వత నివాసం వుందన్నారు.
ఖతార్‌లోని దోహా నుంచి దాదాపు 15 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం సాయంత్రం ఆమె వాషింగ్టన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్యాగేజ్ బెల్ట్ వద్ద వీల్‌చైర్‌లో వున్న మహిళ స్పందించకపోవడంతో భద్రతా సిబ్బంది.
సీబీపీ అధికారులకు తెలియజేశారు.
దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు .యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లను పిలిపించారు.వారు పది నిమిషాల పాటు సదరు మహిళ ప్రాణాలను రక్షించే ప్రయత్నాలు నిర్వహించినట్లు ఫెడరల్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
తరువాత ఎయిర్‌పోర్ట్ పారామెడిక్స్ కూడా రంగ ప్రవేశం చేయడంతో కాసేపటికి మహిళ పల్స్ కొట్టుకోవడం ప్రారంభించింది.దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందే వరకు మహిళకు పల్స్ పూర్తిస్థాయిలో రానప్పటికీ.అత్యంత క్లిష్టమైన చివరి పది నిమిషాల్లో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మెడిక్స్ చేసిన ప్రయత్నాలే ఆమె ప్రాణాలు నిలబడటానికి ఎంతగానో తోడ్పడ్డాయని అధికారులు తెలిపారు.
యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెన్సీ గడిచిన కొన్నేళ్లుగా అత్యంత సుశిక్షితులైన అత్యవసర వైద్య నిపుణులను కలిగి వుంది.ఈ విభాగంలోని ఫీల్డ్ ఆపరేషన్స్ అధికారులు… గాలి, నీరు, భూమి మీద ప్రయాణించేవారికి ఆసరా వుంటారు.ప్రయాణ సమయంలో అధికారులు, సిబ్బంది, ప్రయాణీకులు తీవ్రమైన వైద్య సమస్యతో బాధపడుతుంటే తక్షణమే రంగంలోకి దిగి వైద్య సహాయం చేస్తారు.ప్రస్తుతం 368 అధికారులు ఈఎంటీలుగా, 13 మంది పారామెడిక్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.