ప్రముఖ ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్లకు తీపి కబురు అందించింది.నిలిచిపోయిన పాలసీని మళ్లీ రివైవల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఎల్ఐసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.
అయితే ఈ రివైవల్ ప్రక్రియ ఫిబ్రవరి 7న స్టార్ట్ అవుతుంది.అంటే సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ మార్చి 25 వరకు కొనసాగుతుంది.
ఈ సమయంలోగా కస్టమర్లు తమ పాలసీలను పునరుద్ధరించవచ్చు.
ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా కరోనా వల్ల చాలా కుటుంబాల ఆర్థిక పరిస్థితి కుదేలయింది.అలాగే చాలామంది కరోనా బారిన పడి ఉన్న ఆస్తులనంతా అమ్ముకున్నారు.
ఇప్పటికీ కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించి వేస్తోంది.దీంతో ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం తప్పనిసరిగా మారుతోంది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాలసీల పునరుద్ధరణకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఎల్ఐసీ సంస్థ.
అయితే పాలసీని రివైవల్ చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.కాగా ఈ ఆలస్య రుసుములో రాయితీలు కూడా ఇస్తామని ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.పాలసీ మొత్తాన్ని బట్టి లేట్ ఫీజు అనేది చేంజ్ అవుతుందని పాలసీదారులు గమనించాలి.
ఇక మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు మాత్రం ఎలాంటి లేట్ ఫీజు చెల్లించనక్కర్లేదు.ఒకవేళ మీ నిలిచిపోయిన పాలసీ ప్రీమియం విలువ రూ.2 లక్షలు ఉందనుకుంటే.అందులో 20 శాతం అంటే రూ.4 వేల వరకు ఎల్ఐసీ రాయితీ ఇస్తుంది.
నిలిచిపోయిన పాలసీ ప్రీమియం విలువ మూడు లక్షలకు మించితే గరిష్టంగా 30 శాతం వరకు రాయితీ అందుకోవచ్చు.ఇక్కడ పాలసీదారులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.అది ఏంటంటే… ప్రీమియం నిలిచిపోయి ఐదేళ్లు లేదా అంతకన్నా తక్కువ సమయం ఉన్న పాలసీలను మాత్రమే పునరుద్ధరించడం సాధ్యమవుతుంది.
ఐదేళ్లకు మించిన పాలసీ ప్రీమియంలను తాము పునరుద్ధరించమని ఎల్ఐసీ కూడా స్పష్టం చేసింది.