పవర్ ఫుల్ యానిమల్ ఖడ్గమృగం గురించి అందరికీ తెలుసు.శక్తి వంతమైన ఏనుగుతోనూ భీకరంగా పోరాడగలిగే సత్తాను ఖడ్గ మృగం కలిగి ఉంటుంది.
తన పదునైన కొమ్ములతో ఖడ్గమృగం ఎవరినైనా ఇట్టే చీల్చగలుగుతుంది.ఈ నేపథ్యంలో లయన్ కూడా ఖడ్గ మృగంతో ఫైట్ చేయాలంటే భయపడుతుంటుంది.
అటువంటి ఖడ్గమృగాన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది ఓ అమ్మాయి.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ అవుతోంది.
ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇది నిజమేనా అని అడుగుతున్నారు.
సదరు వైరల్ వీడియో వివరాల్లోకెళితే.అమ్మాయి పెద్ద ఖడ్గ మృగాన్ని కౌగిలించుకోవడమే కాదు.
దానికి ముద్దులు కూడా ఇచ్చింది.ఈ 21 సెకన్ల వీడియో నెట్టింట వైరలవుతోంది.
రైనో హౌస్ అనే ఇన్ స్టా గ్రామ్ యూసర్ షేర్ చేసిన ఈ వీడియోలో అమ్మాయి చాలా ధైర్యంగా ఖడ్గమృగాల వద్ద ఉండటం చూస్తే ఎవరికైనా ముచ్చటేయడమే కాదు., ఆశ్చర్యమేస్తుంది కూడా.
ఈ వీడియోను నెటిజన్లు ఇంకా వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.తమ అకౌంట్స్ లో షేర్ చేస్తూ అమ్మాయి ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు.
ఈ అమ్మాయి నిజంగానే చాలా ధైర్యవంతురాలు అని అంటున్నారు.అయితే, ఒకవేల ఖడ్గమృగం చెలరేగితే ఏంటి పరిస్థితి ? అనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అడవి జంతువులకు ఎప్పుడైనా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.ఒక వేల విజృంభిస్తే అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు.అయితే, నెటిజన్లలో కొందరు ఈ అమ్మాయి సదరు యానిమల్స్ తో ఫ్రెండ్ షిప్ చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సదరు అమ్మాయి ఒడిలో పెద్ద ఖడ్గ మృగం ఉండగా, అది కాకుండా ఇంకా రెండు ఖడ్గ మృగాలున్నాయి.