శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేదనే సంగతి తెలిసిందే.చాలామంది ప్రేక్షకులకు సినిమా నచ్చినా కథ, కథనంలో లోపాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.
ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లీడర్ సినిమా ఫ్లాప్ కావడం వెనుక అసలు కారణాలను వెల్లడించారు.
మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్రావాలా సినిమాలో ఎన్టీఆర్ మరో రోల్ కు హరికృష్ణను తీసుకుని ఉంటే ఆ సినిమా సక్సెస్ సాధించేదని అభిప్రాయపడ్డారు.
పూరీ జగన్నాథ్ సినిమాకు ఏం అవసరమో ఆ సీన్లు మాత్రమే తెరకెక్కిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.పూరీ జగన్నాథ్, శేఖర్ కమ్ముల వర్క్ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఇస్తారని మార్తాండ్ కె వెంకటేష్ అన్నారు.
గీతా ఆర్ట్స్ నిర్మాతలు కథలు నచ్చితేనే నిర్మిస్తారని ఆయన తెలిపారు.
లీడర్ పొలిటికల్ గా మంచి సినిమా అవుతుందని భావించామని సినిమా అనుకున్నంత రీచ్ కాలేదని మార్తాండ్ కె వెంకటేష్ అన్నారు.

టీవీలలో మాత్రం ఆ సినిమా హిట్ అయిందని మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు.నేనున్నాను సినిమా హిట్ కాదని అనుకున్నా సక్సెస్ సాధించిందని ఆయన వెల్లడించారు.దూసుకెళ్తా సినిమాకు థియేటర్లలో కంటే టీవీలలో హిట్ అయిందని మార్తాండ్ కె వెంకటేష్ అన్నారు.

సూపర్ సినిమాలో నాగార్జున లుక్ అలా ఉండటంతో తనకు నచ్చలేదని ఆయన అన్నారు.సినిమా రంగంలో ఇగోలు ఉంటాయని సర్దుకొని పోవాలని ఆయన వెల్లడించారు.ఆడియో ఫంక్షన్లలో టెక్నీషియన్లను పట్టించుకోరని అందుకే తాను వెళ్లనని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ఎడిట్ సూట్ లో సీన్లు, ఫైట్స్ కట్ చేయిస్తారని ఆయన వెల్లడించారు.