తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు బీజేపీ బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ టార్గెట్ గా అన్ని రకాల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే బండి సంజయ్ మాత్రం కెసీఆర్ టార్గెట్ గా చాలా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది.అయితే బండి సంజయ్ విమర్శల వైఖరిపై కొన్ని రకాల వర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కెసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.
ఇలాంటి అభిప్రాయం పలు రకాల వర్గాలలో కలగడానికి ప్రధాన కారణం కెసీఆర్ మానవ మృగం అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో తెలంగాణను సాధించిన నేతగా చరిత్రలో నిలిచిపోయిన కెసీఆర్ పేరును సమసిపోయేలా చేసి ఇతర అభిప్రాయాన్ని పదే పదే విమర్శల రూపంలో వ్యక్తం చేయడం ద్వారా కెసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే ఇతర పార్టీలలో ఉన్న నేతలు కూడా ప్రజల్లో పెద్ద స్థాయి నేతలుగా గుర్తింపు పొందుతారనే భవిష్యత్ వ్యూహంలో భాగంగా ఇప్పటి నుండే కార్యాచరణను అమలు చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇలాంటి ఎన్నో రకాల అవరోధాలను తనకనుగుణంగా గొప్ప అవకాశాలుగా మలుచుకొన్న సందర్భాలు ఎన్నో కెసీఆర్ తన రాజకీయ జీవితంలో చూసి ఉండడంతో కెసీఆర్ గురించి పూర్తి స్థాయిలో తెలిసిన నేతలు ప్రతిపక్ష పార్టీల వ్యూహాత్మక ఎత్తుగడలను చూసి కొంచెం హాస్యాస్పదంగా భావిస్తున్నారట.ప్రస్తుతం బీజేపీ ఒక బండి సంజయ్ మాత్రమే కాదు ఇటు ధర్మపురి అరవింద్ కూడా పరుష పదజాలాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఉపయోగించిన సందర్భాలను మనం చూశాం.ఏది ఏమైనా తెలంగాణలో పాలన ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని, పాలన ద్వారానే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని భావిస్తున్న కెసీఆర్ ఇటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది.