పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.అదుగో ఇదుగో సంక్రాంతికి పక్కా అంటూ నిర్మాత నాగ వంశీ అభిమానులను ఆశ పెట్టాడు.
కాని పవన్ కళ్యాణ్ చెప్పాడని.పెద్ద సినిమాల కోసం అంటూ సంక్రాంతి బరి నుండి తప్పించారు.
ఆ పెద్ద సినిమాలు సంక్రాంతికి రాలేదు.పెద్ద సినిమాలు తప్పుకున్న వెంటనే భీమ్లా నాయక్ ను సంక్రాంతికి విడుదల చేసి ఉంటే అద్బుతంగా ఉండేది.
రెండు వారాల్లో సాధ్యం అయినంత వసూళ్లు దక్కించుకునేది.కాని నాగ వంశీ సంక్రాంతికి తీసుకు రావడంలో విఫలం అయ్యాడు.ఇక ఫిబ్రవరి చివరి వారంలో సినిమాను విడుదల చేయాలని బలంగా అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.కాని ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా ఉండే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
సంక్రాంతి నుండి ఫిబ్రవరి చివరి వారం కు వాయిదా పడ్డ భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా లేని కారణంగా ఫిబ్రవరి లో సినిమాలను విడుదల చేసేందుకు గాను పలువురు ఫిల్మ్ మేకర్స్ సిద్దం అవుతున్నారు.

ఇలాంటి సమయంలో భీమ్లా నాయక్ ను ఎందుకు వాయిదా వేస్తున్నారు వంశీ గారు అంటూ పవన్ అభిమానులు ట్విట్టర్ ద్వారా నాగ వంశీని ప్రశ్నిస్తున్నారు.ఆయన నుండి ఎలాంటి సమాధానం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ ను అందించాడు.కనుక సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.మలయాళం అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా లో రానా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.