కల్యాణి ప్రియదర్శన్.నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు జనాలకు పరిచయం అయ్యింది.
హలో సినిమాతో టాలీవుడ్ కు హాయ్ చెప్పింది.ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఒకప్పటి హీరోయిన్ లిజి, దర్శకుడు ప్రియ దర్శన్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ కేరళ కుట్టి.కెరీర్ ఆరంభంలో కొన్ని అవకాశాలను, రెండు మూడు హిట్స్ వచ్చినా.
ఈ మధ్య మంచి సక్సెస్ రేట్ తో ముందుకు సాగుతుంది.కేవలం రెండు నెలల కాలంలో మూడు హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు.
కల్యాణి హీరోయిన్ గా చేసిన మానాడు అనే తమిళ సినిమా నవంబర్ 25న రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.గత వారం విడుదల అయిన హృదయం అనే మలయాళం సినిమా కూడా అద్భుత విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తన కెరీర్ లో మెమరబుల్ హిట్ అందించింది.
దీంతో పాటు జనవిర 26 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న మలయాళీ మూవీ బ్రో డాడీ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటుంది.అయితే హృదయంలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ తో కలిసి నటించి ఈ అమ్మడు.
బ్రో డాడి సినిమాలో మోహన్ లాల్ తో కలిసి నటించింది.

అయితే ఇదే ఈ సక్సెస్ ఫుల్ సినిమాల నడుమ డిసెంబర్ లో మాలీవుడ్ ఎపిక్ డ్రామా మరక్కార్ రిలీజ్ అయ్యింది.ఈ సినిమా జనాలను మెప్పించలేకపోయింది.ప్రస్తుతం కల్యాణి టైమ్ మాములూగా లేదు అంటున్నారు సినీ జనాలు.
తొలుత కెరీర్ ను అంత ఊపుగా కొనసాగించలేకపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం గాడిలో పడింది.వరుస సినిమాలో మంచ జోష్ ఫుల్ గా ముందుకు సాగుతుంది.
ఇదే ఊపులో మరికొన్ని సినిమాలకు సైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.