ఏదో ఒక వివాదం ద్వారా తరచూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా చిరంజీవి తల్లికి క్షమాపణలు చెప్పడం ద్వారా వార్తల్లో నిలిచారు.కాస్టింగ్ కౌచ్ వివాదం ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్న శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం కోసం ప్రయత్నించి సభ్యత్వాన్ని పొందడంలో విఫలమయ్యారు.
చిరంజీవి తల్లి గురించి తప్పుగా కామెంట్లు చేయడంపై శ్రీరెడ్డి స్పందిస్తూ ఒక పెద్దమనిషి ఇచ్చిన సలహా వల్లే చిరంజీవి అమ్మ అంజనమ్మను తిడుతూ తాను కామెంట్లు చేశానని అన్నారు.
ఈ వివాదంతో ఎటువంటి సంబంధం లేని అంజనమ్మను తాను తిట్టడం తప్పని శ్రీరెడ్డి అన్నారు.చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవించానని ఆమె చెప్పుకొచ్చారు.ఈ విషయంలో నాకు సోషల్ మీడియా నుంచి ట్రోల్స్ వచ్చాయని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.
అంజనమ్మను తిడుతూ చేసిన కామెంట్ల విషయంలో ఇప్పటికీ బాధ పడుతున్నానని శ్రీరెడ్డి అన్నారు.అన్యాయంగా చిరంజీవి తల్లిని తిట్టడం కరెక్ట్ కాదని తాను అనుకుంటున్నానని తాను తప్పు చేశానని బుద్ధి గడ్డి తినడంతో అలా తిట్టానని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.శ్రీరెడ్డి క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పడంతో చిరంజీవి అభిమానులు సైతం కూల్ అవుతున్నారు.
ఆడవాళ్లను తిట్టడం ద్వారా న్యాయం జరుగుతుందని ఒక పెద్ద మనిషి చెప్పడంతో తాను అలా చేశానని శ్రీరెడ్డి తెలిపారు.చిరంజీవి తల్లి తనను క్షమిస్తుందని భావిస్తున్నానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పి మంచి పని చేశారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.