లగడపాటి విక్రమ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి.గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్.

 3rd Lyrical Song Release From Lagadapati Vikram Debut Movie virgin Story Movie ,-TeluguStop.com

తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.రౌడీ బౌయ్స్ లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కు అతని ప్రదర్శన కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ యంగ్ టాలెంట్ విక్రమ్ వర్జిన్ స్టోరి చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు.కొత్తగా రెక్కలొచ్చెనా.అనేది ఈ సినిమా క్యాప్షన్.రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఫిల్మ్ యూనిట్.

సోషల్ మీడియా ద్వారా పాటను డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది అనే పాయింట్ తో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసేలా వర్జిన్ స్టోరి సినిమా ఉంటుందని నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ చెబుతున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విక్రమ్, సౌమిక, పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – అచు రాజమణి, సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ – గ్యారీ, సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర, నిర్మాతలు – లగడపాటి శిరీష్, శ్రీధర్, రచన దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.

3rd Lyrical Song Release From Lagadapati Vikram Debut Movie "Virgin Story" Movie , Lagadapati Vikram , Virgin Story, Tollywood, Lagadapati Sirisha , Sridhar, Vikram, Soumika, Pandian, Rishika Khanna, Vineet Bavishetti - Telugu Pandian, Rishika Khanna, Soumika, Sridhar, Tollywood, Vikram, Virgin Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube