1.ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మాస్క్ ధరించకపోతే 100 రూపాయలు జరిమానా విధించనున్నారు.
2.అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం
అరుణాచల్ ప్రదేశ్ లో మరోసారి భూకంపం సంభవించింది రెక్టార్ స్కేల్ పై 4.9 శాతంగా తీవ్రత నమోదైంది.
3.తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం

ఇకపై తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
4.ఆమ్ ఆద్మీ పంజాబ్ సీఎం అభ్యర్థి
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవత్ మన్ ను ఎంపిక చేసింది.
5.కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ
బూస్టర్ డోసు, రెండో డోసు మధ్య గడువు తగ్గించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండ్లుడవీయకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
6.చంద్రబాబు కి కరోనా.స్పందించిన జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా వైరస్ ప్రభావం కి గురయ్యారు.దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
7.కేసిఆర్ పై షర్మిల విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఫామ్ హౌస్ నుంచి కాలు బయట పడడం లేదా అంటూ విమర్శలు చేశారు.
8.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.తెలంగాణ చత్తీస్ గఢ్ సరిహద్దులో ఎన్ కౌంటర్

తెలంగాణ
చత్తీస్ గఢ్
సరిహద్దులోని వెంకటాపురం మండలం కర్రిగుట్టల వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
10.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 35,333 మంది భక్తులు దర్శించుకున్నారు.
11.కేసీఆర్ పై రేవంత్ విమర్శలు

ఇంగ్లీష్ విద్య పై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
12.జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ప్రారంభం
వైయస్సార్ జగన్ అన్న శాశ్వతము హక్కు సురక్ష పథకాన్ని ఏపీ సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు.
13.ఏపీ బీజేపీ అధ్యక్షుడు విమర్శలు

కేసినో వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
14.మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలి
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా నన్ను హామీని సీఎం జగన్ విస్మరించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు.ఎన్టీఆర్ సొంత గడ్డ గుడివాడ ను జుదాలకు అడ్డాగా మార్చారని , మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
15.ఎన్టీఆర్ పై రఘురామ కామెంట్స్

తెలుగు కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన మహా నాయకుడు గొప్ప నటుడు ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చి గౌరవించుకోలేని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు.
16.దేవినేని ఉమాకు కరోనా
మాజీమంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
17.పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు

విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పాఠశాలలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని, సెలవులు ఇచ్చే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
18.నాంపల్లి బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం కు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
19.చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కామెంట్స్

చంద్రబాబు కు వచ్చిన కరోనా తగ్గిపోతుంది కానీ, ఎన్టీఆర్ వెన్నుపోటు మాత్రం గుర్తు ఉంటుంది అటు టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,090
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,090
.