1.తెలుగు మహిళ కు ఇన్వెంటర్ అవార్డ్
5 జీ టెక్నాలజీ ని అభివృద్ధి చేసిన టీమ్ లో ఉన్న తెలుగు మహిళ కల్యాణీ బోగినేని కి మాస్టర్ ఇన్వెంటర్ అవార్డు ను అమెరికా లోని వెరిజెన్ సంస్థ ప్రకటించింది.
2.మెక్సికన్ అధ్యక్షుడికి రెండోసారి కరోనా
మెక్సికన్ అధ్యక్షుడు అండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ కు రెండోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
3.ట్రంప్ ను చంపుతా అని బెదిరించిన వ్యక్తి అరెస్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను చాంపుతా అని బెదిరించిన థామస్ వెల్నికి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
4.శ్రీలంక కు సహకారం అందించిన భారత్
శ్రీలంక లో రైల్వే అభివృద్ధి నిమిత్తం భారత్ 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి శాతం అందించింది.
5.స్పెయిన్ లో 90 వేల కరోనా మరణాలు

స్పెయిన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది.ఇప్పటి వరకు కరోనా కారణంగా 90 వేల మరణాలు సంభవించినట్టు స్పెయిన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
6.మనిషికి పంది గుండె .ఆపరేషన్ విజయవంతం
మనిషికి పంది గుండె అమర్చడం.ఆ ఆపరేషన్ సక్సెస్ అయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అమెరికాలోని బాల్జిమోర్ లో డేవిడ్ బెనెట్ అనే వ్యక్తికి ఈ ఆపరేషన్ నిర్వహించారు.
7.ఒమి క్రాన్ వేరియంట్ కు మార్చిలో వాక్సిన్

ఒమి క్రాన్ వేరియంట్ వైరస్ కు మార్చిలో ఫైజర్ టీకా అందుబాటులోకి రానుంది.ఈ విషయాన్ని ఫైజర్ సంస్థ ప్రకటించింది.
8.శ్రీలంక లో ముగిసిన చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన
శ్రీలంక లో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ పర్యటన ముగిసింది.
9.అమెరికాలో ఒక్కరోజులోనే 14 లక్షల కేసులు

అమెరికాలో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి.నిన్న ఒక్క రోజులోనే 14 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
10.చైనా లో మరో సిటీ లో లాక్ డౌన్
చైనాలోని సెంట్రల్ హెనాన్ సిటీ లో కరోనా తీవ్రత పెరిగిన కారణంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు గా అధికారులు తెలిపారు.