టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో త్రివిక్రమ్, మహేష్ ల కాంబినేషన్ తప్పకుండా ఉంటుంది.వీరిద్దరి కాంబినేషన్ లో 17 ఏళ్ల క్రితం వచ్చిన అతడు సినిమా, అలాగే 12 ఏళ్ల కిందట వచ్చిన ఖలేజా సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయాయి.
అలా వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే విధంగా సినిమాలు ఇచ్చారు.అయితే ఖలేజా, అతడి సినిమాలు విడుదలైన సమయంలో పరిస్థితుల కారణంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ ని తీసుకురాలేకపోయినా కూడా ఆ తరువాత మాత్రం సినిమాలు క్లాసిక్ హోదా ని అందుకున్నాయి.
ఇదిలా ఉంటే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది.ఇందుకు సంబంధించిన ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తాజాగా మహేష్ బాబు కు, రమేష్ బాబు కు మధ్య ఉన్న సంబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.
ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు మహేష్ బాబు ఫోన్ కాల్ మాట్లాడి దిగులుగా కూర్చున్నాడట.అది గమనించిన త్రివిక్రమ్ మహేష్ వద్దకు వెళ్లి ఏమైంది అని అడిగగా.
తన అన్న రమేష్ బాబు ఆరోగ్యం బాగోలేదని. జ్వరంతో బాధ పడుతున్నాడని తెలిపారట.
అప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని మహేష్ బాబుని త్రివిక్రమ్ అడగగా.అది భారీ బడ్జెట్ సినిమా కావడంతో అవసరంలేదు అని చెప్పి ఆ బాధలోనే షూటింగ్ పూర్తి చేసి వెంటనే హాస్పిటల్ కి వెళ్ళిపోయాడట మహేష్ బాబు.
అలా మహేష్ బాబుకు తన అన్న రమేష్ బాబు అంటే అంత ఇష్టం.తన అన్నకు చిన్న జ్వరం వచ్చినా కూడా మహేష్ బాబు తట్టుకోలేడు.అటువంటిది ఏకంగా రమేష్ బాబు మరణించడం మహేష్ బాబు కు నిజంగా తీరని లోటు అని చెప్పవచ్చు అని తెలిపాడు త్రివిక్రమ్.ఇక మహేష్ బాబు సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన లెటర్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.
నువ్వే నాకు సర్వస్వం అన్నయ్య.నువ్వు లేని నేను సగం మాత్రమే.ఎన్ని జన్మలైనా నువ్వే నాకు అన్నయ్య కావాలి అంటూ మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మహేష్ బాబు నటించిన అర్జున్, అతిథి లాంటి సినిమాలకు రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.