తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.NATS బోర్డ్ చైర్ పర్సన్ గా అరుణ గంటి

అమెరికా లోని అతి పెద్ద తెలుగు సంఘం నాట్స్ లో తొలిసారిగా ఓ మహిళను బోర్డ్ చైర్మన్ గా  నియమించారు.ఈ పదవి కి అరుణ గంటి ఎంపికయ్యారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

2.తెలుగు సంఘాల ఆధ్వర్యంలో రచ్చబండ

తెలుగు భాషా సంఘాలు ఆన్లైన్ లో రచ్చ బండ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.ఈ నెల 8 వ తేదీ సాయంత్రం 7 గంటలకు జరగనున్న రచ్చబండలో వీవెన్ ( వీరపనేని వీర వెంకట చౌదరి ) ప్రధాన ప్రసంగం చేయనున్నారు.

3.నెదర్లాండ్స్ లో అగ్ని ప్రమాదం .తెలుగు ఎన్.ఆర్.ఐ మృతి

నెదర్లాండ్స్ రాజధాని హెగ్ లో ఓ భవనం లో ఈ నెల 5 న జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ లోని అసిఫ్ నగర్ కు  చెందిన అబ్దుల్ హాదీ (43) మృతి చెందారు.

4.దేశ పౌరులు, నివాసితులకు సౌదీ హెచ్చరిక

దేశ పౌరులు, నివాసితులకు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం, మాస్క్ ధరించడం తప్పనిసరి అని, నిబంధనలు పాటించని వారి పై వెయ్యి సౌదీ రియాల్ ( సుమారు 20 వేలు ) జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేసింది.

5.బ్రిటన్ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత .రంగంలోకి సైన్యం

బ్రిటన్ లో కరోనా , ఒమి క్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడింది.దీంతో సైన్యం ను రంగంలోకి దించారు.

6.చైనాలో భారీ భూకంపం

చైనా లో భారీ భూకంపం సంభవించింది.ప్రావిన్షియల్ రాజధానిలో కింగ్ హైదరాబాద్ లో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు భూమి కంపించింది.

7.పాకిస్థాన్ లో ఘోరం

పాకిస్తాన్ లో ఘోరం సంభవించింది. పంజాబ్ లో తీవ్రంగా కురుస్తున్న మంచు లో చిక్కుకుని కార్లలో ఉన్న 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

8.సాయం కోసం చైనా వెళ్లనున్న పాక్ ప్రధాని

ఓవైపు కరోనా మరోవైపు ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చే నెలలో చైనా వెళ్లే ఆలోచనలో ఉన్నారు.

9.కజికిస్తాన్ లో అల్లర్లు.రంగంలోకి రష్యా

కజకిస్తాన్ లో అల్లర్లు చెలరేగాయి.దీంతో ఆ అల్లర్లను అదుపు చేసేందుకు రష్యా సాయం కోరింది.దీనిపై అమెరికా అభ్యంత్రం వ్యక్తం చేసింది.అసలు ఈ అల్లర్లు చెలరేగడానికి కారణం ఇంధన ధరల పెంపు, ఎల్పీజీ సబ్సిడీ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube