ఇదేం ఫ్యాషన్ రా బాబు: అక్కడ ఉమ్ముతో హెయిర్ స్టైలింగ్..!

కొంతమంది కొన్ని సార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారు.అందులో కొన్ని తెలిసి చేస్తే ఇంకొన్ని తెలియకుండా చేస్తారు.

 Jawed Habib Spitting On Woman Hair Goes Viral Details, Fashion, Latest News, Ha-TeluguStop.com

ఆ వీడియోలు కాస్తా వైరల్ అయ్యాయంటే ఇక ప్రపంచం మొత్తం వారి గురించి నెగిటివ్ గా చెప్పుకుంటుంది.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

పాపులర్ హెయిర్ స్టైలిష్ట్ అయిన జావేద్ హబీబ్ కు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.జావేద్ హబీబ్ ఇప్పుడొక గొప్ప హెయిర్ స్టైలిషింగ్ అని చాలా మందికి తెలుసు.

ఆయన ఓ యువతికి హెయిర్ స్టైల్ చేస్తుండగా నీళ్లను ఉపయోగించుకుండా ఆయన ఆ నీళ్లకు బదులుగా ఉమ్మిని వాడాడు.ఈ ఘటన విమర్శనాత్మకంగా వైరల్ అయ్యింది.

వీడియోలో ఓ మహిళ సెలూన్ ఛైర్ లో కూర్చొని ఉంది.ఆమె జావేద్ హబీబ్ చేసే హెయిర్ కట్ కోసం వేచి ఉంది.

దీంతో జావేద్ దువ్వెనతో జుట్టును సరిచేసుకుంటూ హెయిర్ కేర్ టిప్స్ చెబుతూ వస్తున్నాడు.ఆ సమయంలో జావేద్ ఉమ్మిని వినియోగించడంతో ఆమె సీరియస్ అయ్యింది.

ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ ఆ మహిళ జుట్టు మురికిగా ఉందని చెప్పాడు.

అలా ఆమె జుట్టు ఎందుకు మురికిగా ఉందంటే తాను షాంపో వాడలేదని తెలిపాడు.

ఒక వేళ నీరుగానీ లేకపోతే ఉమ్మితోనే హెయిర్ కట్ చేసేయాలంటూ హబీబ్ చెప్పుకొచ్చాడు.అలా చెబుతూనే ఆమె తలపై ఉమ్మేశాడు.

దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ట్రైనింగ్ సెమినార్ లో జరిగింది.

వీడియోలో సెలూన్ కుర్చీ పై కూర్చొని ఉన్న మహిళను పూజా గుప్తాగా గుర్తించారు.

ఆమె జావేద్ చేసిన పనికి బాధపడుతోంది.జావేద్ హబీబ్ సార్ సెమినార్‌ లో స్టేజికి మీద అలా చేయడంతో ఆమె ఎంతో ఫీల్ అయ్యానని ట్వీట్ ద్వారా తెలిపింది.ఆయన తప్పుడు ప్రవర్తన నచ్చలేదని తెలిపింది.

రోడ్డు పక్కన సెలూన్ లో కటింగ్ చేసుకుంటాను గానీ జావేద్ హబీబ్ దగ్గరకు మాత్రం హెయిర్ కట్కు  వెళ్లనని ఆమె ట్వీట్టర్ ద్వారా తెలియజేసింది.దీంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube