' ముద్రగడ ' తాపత్రయం కాపులు అర్దం చేసుకున్నారా ?  

ప్రస్తుతం కులాలకు సంబంధించిన రాజకీయ ఏపీలో నడుస్తోంది.ఏ కులం ను దగ్గర చేసుకుంటే తమకు కలిసి వస్తుందో,  ఆ కులం వైపు ఎక్కువగా దృష్టి పెట్టి ఆ వర్గం మొత్తం తమ వైపు ఉండేలా చూసుకునేందుకు ఏపీ అధికార పార్టీతో పాటు , మిగతా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 The Conditions Were Such That The Kapu Castes Did Not Believe In Mudragada Padma-TeluguStop.com

ఈ పార్టీల వ్యవహారం ఇలా ఉండగానే,  కొత్తగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రత్యామ్నాయ వేదిక తెర  మీదకు తీసుకువచ్చారు.కాపు సామాజిక వర్గం తో పాటు,  బీసీ ,ఎస్సీ లను కలుపుకొని బలమైన శక్తిగా ఏపీలో అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక అన్ని పార్టీలకు చెందిన కాపు సామాజిక వర్గం కీలక నాయకులు అంతా ఇటీవల హైదరాబాద్ లో సమావేశమై కాపుల ఐక్యతను చాటి చెప్పేందుకు ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎవరు ఏ పార్టీలో ఉన్నా,  కాపు సామాజిక వర్గానికి మేలు జరిగే విధంగా చూసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.

అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గం లో వచ్చిన కదలికను మొత్తం వైసీపీ టార్గెట్ చేసుకున్నట్టుగానే కనిపిస్తోంది.హైదరాబాదులో జరిగిన కాపు సామాజిక వర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి , విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించడంతో టీడీపీ కి మద్దతుగా కాపులను దగ్గర చేసేందుకు , అలాగే సామాజిక పరంగానూ,  రాజకీయంగానూ తమకు కాపుల మద్దతు పూర్తిగా ఉందని నిరూపించుకునేందుకు ఆయన ప్రయత్నించినట్లు కనిపిస్తున్నారు.

దివంగత వంగవీటి మోహన్ రంగ కుమారుడు రాధ కూడా ఇటీవల యాక్టీవ్ అయ్యారు.

రాజకీయంగా చక్రం తిప్పేందుకు ప్రయత్నించడం, కాపు సామాజిక వర్గం లోనూ పూర్తిగా కదలిక తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .ప్రస్తుతం ఆయన టిడిపిలో ఉండడంతో,  రాధాకృష్ణ కాపు పోరాటం టి డి పీ కే కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.  అలాగే ఇప్పుడు ప్రత్యామ్నాయ వేదిక ను ఏర్పాటు చేస్తున్న మాజీ మంత్రి , కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అకస్మాత్తుగా యాక్టివ్ కావడానికి కారణం పైన జరిగిన వ్యవహారాలే కారణంగా కనిపిస్తుంది.

కాపు సామాజిక వర్గం మొత్తం టిడిపి వైపుకు వెళ్లకుండా,  వైసీపీ అధినేత జగన్ సూచనలతో ముద్రగడ రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది.కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పుడు ముద్రగడ విషయంలో ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే ముద్రగడ కు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో, ముద్రగడ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.వైసీపీ కోసమే ముద్రగడ రంగంలోకి దిగారు అనే విషయాన్ని ఇప్పుడు కాపులు నమ్ముతున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube