ఇప్పటివరకు తెలుగు సినిమా స్టామినా కేవలం దక్షిణాది రాష్ట్రాల వరకు మాత్రమే విస్తరించి ఉంది.ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారో అప్పటినుంచి తెలుగు దర్శకుల సత్తా ప్రపంచం మొత్తం చూసింది.
ఇలా బాహుబలి సినిమా ద్వారా రాజమౌళి, పుష్ప సినిమా ద్వారా సుకుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
ఇకపోతే ఈ ఏడాది రాజమౌళి RRR, సుకుమార్ పుష్ప పార్ట్ 2 ద్వారా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఇలా తెలుగు దర్శకులకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు రావడంతో మరికొంతమంది దర్శకులు సైతం బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా లైగర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ పై అటాక్ చేయడానికి సిద్ధమయ్యారు.అదేవిధంగా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ద్వారా రాధాకృష్ణ బాలీవుడ్ ఇండస్ట్రీ పై తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఇలా ఎంతో మంది దర్శకులు బాలీవుడ్ ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా తాజాగా మరో దర్శకుడు కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించాలని నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళికి సుకుమార్ బాటలోనే బాలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.