స్కిన్ టోన్ పెంచుకోవాలనే కోరిక ఎందరికో ఉంటుంది.ఆ కోరికను నెరవేర్చుకునేందుకే ఏవేవో ఫేస్ క్రీములు, సీరమ్‌లు వాడతారు.
మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల ఫేస్ ప్యాకులను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.అలాగే స్కిన్‌పై చేయాల్సిన ప్రయోగాలు అన్నీ చేస్తుంటారు.
అయినా ఫలితం లేకుంటే తీవ్రంగా కృంగిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ సూపర్ ఫేస్ ప్యాక్‌ను ట్రై చేస్తే చాలా సులభంగా మరియు వేగంగా స్కిన్ టోన్‌ను పెంచుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ ప్యాక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలను ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక యాపిల్ పండు తీసుకుని వాటర్‌లో వేసి శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత యాపిల్ పై తొక్కను తొలగించి లోపలి భాగాన్ని మాత్రం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు యాపిల్ పేస్ట్‌లో ఒక స్సూన్ బార్లీ పౌడర్, రెండు స్పూన్ల తేనె.అర స్పూన్ నిమ్మ రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలీ అనుకుంటే మెడకు కూడా అప్లై చేసుకుని.పది హేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆర బెట్టు కోవాలి.అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని మరియు మెడను క్లీన్ చేసుకోవాలి.
ఈ ప్యాక్‌ను రెండు రోజులకు ఒక సారి వేసుకుంటే.
మీ స్కిన్ టోన్ క్రమ క్రమంగా పెరుగు తుంది.పైగా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంపై ఏర్పడిన ఎటు వంటి మచ్చలైన క్రమంగా మటు మాయం అవుతాయి.
పొడి చర్మం నుంచి విముక్తి లభిస్తుంది.చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి.
మరియు సన్ ట్యాన్ సమస్య సైతం దూరం అవుతుంది.