అఫిషియల్ గా శుభవార్త చెప్పిన కాజల్ దంపతులు..ఫోటో వైరల్!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Gautam Kitchlu Confirms Kajal Aggarwal's First Pregnancy, Kajal Aggarwal, Gautam-TeluguStop.com

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా ఇప్పటికే అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ దూసుకు పోతుంది.స్టార్ హీరోలతో మాత్రమే కాదు చిన్న హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా వరస అవకాశాలు అందుకుంటూ కుర్ర భామలకు పోటీ ఇస్తుంది.

ఈ మధ్య ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చేస్తుంది.పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తా అని చెప్పడమే కాకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ చేసింది కూడా.

అయితే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మరేమీ సినిమాలు ఒప్పుకోవడం లేదు.ఒప్పుకున్నా రెండు మూడు సినిమాలు నుండి కూడా తప్పుకుంది.

Telugu Pregnancy, Gautam Kitchlu, Gautamkitchlu, Kajal Aggarwal-Movie

దీంతో కాజల్ ప్రెగ్నెంట్ అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నప్పటికీ కాజల్ దంపతులు మాత్రం నోరు విప్పలేదు.అయితే న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ దంపతులు తమకు త్వరలోనే బేబీ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ మొదటి బిడ్డను 2022 లో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారికంగా తెలిపారు.

Telugu Pregnancy, Gautam Kitchlu, Gautamkitchlu, Kajal Aggarwal-Movie

గౌతమ్ కిచ్లు తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.ఇదిగో 2022 మీ కోసం చూస్తున్నాను అని వ్యాఖ్యను జోడిస్తూ కాజల్ అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.ఈ ఫొటోలో కాజల్ కాస్త బొద్దుగా తయారయ్యి మరింత అందంగా కనిపిస్తుంది.

కాజల్ అందుకే స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చిన కూడా ఒప్పుకేలేదు.ఏది ఏమైతేనేం కాజల్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube