అమెరికాలో ఒమెక్రాన్ విధ్వంసం...ఊహించని రీతిలో కేసుల నమోదు...!!!

అగ్ర రాజ్యం అమెరికా కరోనా కొత్త వేరియంట్ ఒమెక్రాన్ దెబ్బకు అల్లాడిపోతోంది.కరోనా మొదటి వేవ్ సమయంలో ఎదుర్కున్న గడ్డు పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతాయా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అమెరికన్స్.

 Omekron Destruction In America Unexpected Registration Of Cases , America , Om-TeluguStop.com

ఒక వైపు నిపుణులు మాత్రం ఈ మహమ్మారి కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు రాలేదని, కానీ భవిష్యత్తులో మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఊహించని విధంగా, పరిశోధకులు సైతం షాక్ అయ్యేలా ఒమెక్రాన్ కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకోవడంతో అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు రేగుతున్నాయి.

గడిచిన వారం రోజుల్లో అమెరికాలో సుమారు 2.70 లక్షల కేసులు నమోదు అయ్యాయని ఈ సంఖ్య మరో రెండు రోజుల వ్యవధిలో 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు.ఇక్కడ అందరిని కలవర పరిచే మరొక విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ మొదలయ్యి దాదాపు 50 శాతం పూర్తయ్యింది.కరోనా గత వేరియంట్స్ వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలో ఎక్కడా కనిపించలేదు కానీ వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి అలాగే బూస్టర్ డోస్ వేసుకున్న వారికి కూడా ఒమెక్రాన్ సోకడంతో నిపుణులు, అధికారులు, ప్రభుత్వం సైతం తీవ్ర ఆందోళన చెందుతోంది.ఇదిలా ఉంటే.

గడిచిన 14 రోజుల్లో కరోనా కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని అంటున్నారు అధికారులు.

గతంలో రోజున సగటుకు 1200 మరణాలు సంభవించేవని కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 1500 లకు చేరుకుందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC ) తెలిపింది.ఈ నేపద్యంలో CDC అధికారి మాట్లాడుతూ గతంలో కంటే ఒమెక్రాన్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనని కానీ ఒమెక్రాన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Omicron Cases Increased in America #Omicon

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube