ఈ సస్పెన్స్‌ ఏంటి బంగార్రాజు... ఇంకా ఎప్పటికి క్లారిటీ ఇస్తావు?

తెలుగు సినిమాల జోరు సంక్రాంతికి భారీగా ఉండబోతుంది.సంక్రాంతి సినిమాలపై కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుంది అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్లుగా రచ్చ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

 Nagarjuna And Naga Chaitanya Bangarraju Movie Release Date , Nagarjuna , Naga Ch-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కి ముందే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక సంక్రాంతికి భారీ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్‌ మరియు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కూడా విడుదల కాబోతుంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమా లతో పాటు సంక్రాంతికి నాగార్జున మరియు నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు సినిమా కూడా విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.షూటింగ్‌ డిసెంబర్ మూడవ వారంలో బంగార్రాజు ముగిస్తాడని అంటున్నారు.

ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ పోస్టర్ లు వరుసగా విడుదల చేస్తున్నారు.ఎప్పుడో విడుదల చేసేందుకు ఇప్పుడే అవన్నీ విడుదల చేయాల్సిన అవసరం లేదు.

ఖచ్చితంగా సంక్రాంతి కి విడుదల చేయాలి కనుకే బంగార్రాజు హడావుడి చేస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని ఇప్పటి వరకు నాగార్జున బంగార్రాజు టీమ్ మాత్రం అసలు సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

Telugu Bangarraju, Fil, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna, Ramya Krishna,

సస్పెన్స్ కంటిన్యూ చేస్తూ డిసెంబర్‌ చివరి వరకు రివీల్ చేస్తారేమో అంటున్నారు.ఒక వేళ సంక్రాంతికి కనుక సినిమాను విడుదల చేస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు వింధు భోజనం సంక్రాంతికి పక్కా అంటున్నారు.బంగార్రాజు లో నాగార్జున మరియు నాగ చైతన్య ఇద్దరు కూడా బంగార్రాజు లుగా అంటే తాత మనవడిగా కనిపించబోతున్నారు.ఇద్దరు ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube