నందమూరి బాలకృష్ణ అఖండ నైజాం లో రికార్డ్ సృష్టించాడు.అఖండ సినిమా నైజాం లో 10.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 10 రోజుల్లో 17.47 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తుంది అఖండ.ఇప్పటికీ నైజాం లో అఖండ వసూళ్లు బాగానే ఉన్నాయి. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాల కన్నా ఈ హ్యాట్రిక్ మూవీ సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు.
బాలయ్య ని 100 కోట్ల క్లబ్ లో నిలిచేలా చేసింది అఖండ.
బాలయ్య బాబు స్టామినా ఏంటో అఖండతో మరోసారి ప్రూవ్ అయ్యింది.సినిమా రిలీజైన దగ్గర నుండి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్స్ గా చెప్పుకుంటున్నారు.తప్పకుండా బాలయ్య తన తర్వాత సినిమాలతో కూడా ఇదే ఫాం కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా వస్తుంది.ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షన్ స్టోరీతో వస్తున్నాడని తెలుస్తుంది.
అఖండతో సూపర్ ఫాం లోకి వచ్చిన బాలయ్య బాబు ఇదే ఫాం తో వరుస రికార్డులు కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు.