సుకుమార్ సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఎంత కామనో చంద్రబోస్ లిరిక్స్ కూడా అంతే కామన్.సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుండి రాబోతున్న పుష్ప వరకు సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ గా సుకుమార్ సినిమాలకు పనిచేస్తున్నాడు గీత రచయిత చంద్రబోస్.
లేటెస్ట్ గా పుష్ప సినిమాకు అద్భుతమైన పాటలు రాశారు చంద్రబోస్.పుష్ప పాటల గురించి ఆయన చెబుతూ సుకుమార్ ని సంతృప్తి పరచడం ఓ సవాల్ అని అన్నారు.
అయినా సరే తనకు రావాల్సింది అడిగి వివరించి రాబట్టుకుంటాడని అన్నారు.
వేరే డైరెక్టర్స్ కి చంద్రబోస్ పాటలు రాస్తారు కానీ సుకుమార్ సినిమాలకి రాసినట్టుగా ఆయన రాయరని అనిపిస్తుంది.
సుకుమార్ స్వాతహాగా రైటర్ కాబట్టి అతనికి కావాల్సింది రాబట్టు కుంటాడని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.ఏది ఏమైనా సుకుమార్, చంద్రబోస్ దేవి శ్రీ ప్రసాద్ కాంబో అంటే ఆ ఆల్బమ్ సూపర్ హిట్ అన్నట్టే.
పుష్పలో కూడా ప్రతి పాట దేనికి అదే సూపర్ హిట్ అనేలా ఉన్నాయి.దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుందని అన్నారు చంద్రబోస్.
విజువల్ గా కూడా పుష్ప సాంగ్స్ సూపర్ గా ఉంటాయని అన్నారు చంద్రబోస్.