కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ తలపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రజినీకాంత తర్వాత కోలీవుడ్ లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ తలపతి.
ఈ మధ్యనే విజయ్ తలపతి ‘మాస్టర్’ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తెలుగులో పర్వాలేదనిపించినా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ లో రికార్డు సృష్టించింది.
ఈయన సినిమాలు ప్రజలకు చాలా చేరువగా ఉంటాయి.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఎక్కువుగా సినిమాలు చేస్తూ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాడు.సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు.
ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
విజయ్ 65 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది.
ఈ సినిమా గ్యాంగ్ స్టర్ త్రిల్లర్ గా రూపొందుతుంది.
ఇక ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే సందడి నెలకొంది.ఇక ఈ సినిమా అప్డేట్ గురించి ఆయన అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ ను టీమ్ ప్రకటించింది.
ఈ సినిమా యూనిట్ ఒక ఫోటోను షేర్ చేస్తూ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే విషయాన్నీ తెలిపారు.ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ట్విట్టర్ వేదికగా ఈ ఫోటోను షేర్ చేస్తూ.”ఇది 100వ రోజు షూటింగ్. ఈ అద్భుతమైన వ్యక్తులతో ఈ 100 రోజులు చాలా సరదాగా గడిపాము.” అని షేర్ చేసారు.ఈ ఫొటోలో విజయ్, పూజా తో పాటు చిత్ర యూనిట్ బ్యాండ్ తో చిల్ అవుతూ కనిపించారు.
ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటించనున్నాడు.