సోషల్ మీడియా దెబ్బకు చాలా మంది నటీనటులు ఓ రేంజిలో ఇబ్బందులకు గురవుతున్నారు.నెటిజన్ల ట్రోలింగ్ మూలంగా తలలు పట్టుకుంటున్నారు.
అందాల భామల సొగసులను ఎంజాయ్ చేస్తూనే.మరోవైపు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
కొంతమంది ఈ విమర్శల మూలంగా ఆవేదన చెందితే.మరికొందరు ఏదైతేనేం.
పబ్లిసిటీ వస్తుంది కదా అని ఎంజాయ్ చేస్తున్నారు.ఇంతకీ భారీగా ట్రోలింగ్ కు గురైన బొద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అన్వేషి జైన్
చిన్న వయసులోనే భారీ అందాలతో తీవ్ర ఇబ్బందులు పడింది ఈ ముద్దుగుమ్మ.హార్మోన్ ల కారణంగా తన ప్రైవేట్ పార్ట్స్ బాగా పెరిగాయని చెప్పింది.
అయితే ఇతరుల చూపులు, కాంమెట్స్ తనకు చాలా ఇబ్బంది కలిగించాయని ఆమె వెల్లడించింది.అయితే తన బలహీనతను బలంగా మార్చుకుని ముందుకు సాగుతుంది ఈ ముద్దుగుమ్మ.
అయేషా టకియా

సూపర్ సినిమాతో తన సూపర్ అందాలను బయట పెట్టింది ఈ అమ్మడు.చిన్న చిన్న డ్రస్సులు వేసుకుని.పెద్ద పెద్ద అందాలను బయటపెట్టి అందరినీ ఆకట్టుకుంది.అయితే హార్మోన్ల కారణంగానే తను అలా బరువు పెరిగినట్లు చెప్పింది.లావు కారణంగా పలు సినిమాలను కోల్పోయింది.అటు సన్నబడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.తన ఒంటి బరువు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది.
సమీరారెడ్డి

సినిమాల్లో ఉన్నంత కాలం ఒంటిని బాగానే మెయింటెన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.పెళ్లయ్యాక బరువు బాగా పెరిగింది.ఆమెను బాగా ట్రోల్ చేశారు నెటిజన్లు.కానీ తను ప్రస్తుతం నాజూగ్గా తయారై స్లిమ్ గా మారుతోంది.
ఇలియానా

సినిమాల్లోకి వచ్చినప్పుడు సన్నగా తీగలా ఉండే ఈ అమ్మడు.ఆ తర్వాత బొద్దుగా మారి విమర్శలు ఎదుర్కొంది.ప్రేమ విఫలం కావడంతో మానసిక ఇబ్బందులకు గురైంది.
ఆ తర్వాత భారీగా బరువు పెరిగింది.దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు.
కేతిక శర్మ

రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా మారిన అమ్మడు.ఈ సినిమాలో ఆకాష్ తో రొమాంటిక్ సీన్లలో నటింటే విధానంపై బాగా ట్రోలింగ్ కు గురైంది.
నిత్యా మీనన్

మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ బొద్దుగా ఉన్న పలు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది.కానీ కొందరు ఆమెను ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటారు.
రాశి

భారీ అందాల రాశి కూడా ఒకానొక సమయంలో భారీగా బరువు పెరిగింది.ఆ తర్వాత సన్నగా తయారై.అందరినీ ఆశ్చర్య పరిచింది.అయితే తాను లావుగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె ఓ సారి చెప్పి బాధపడింది.
నమిత

తొలుత నాజూగ్గా ఉన్న ఈమె.ఆ తర్వాత భారీగా బరువు పెరిగింది.మరీ అంద విహీనంగా తయారైంది.దీంతో నెటిజన్లు ఆమెను ఆడుకున్నారు.పెళ్లయ్యాక కాస్త బరువు తగ్గింది.