తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.అలా ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు.
ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైన ఎంతోమంది కమెడియన్ ప్రస్తుతం వెండితెరపై అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా పరిచయమైన వారిలో ముక్కు అవినాష్ ఒకరు.
జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న అవినాష్ బిగ్ బాస్ ఆఫర్ రావడంతో జబర్దస్త్ అగ్రిమెంట్ ప్రకారం మల్లెమాల వారికి పది లక్షలు డబ్బు కట్టి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.
ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడిన అవినాష్ శ్రీముఖి సహాయంతో 10 లక్షలు కట్టి బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఆదరణ దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన అవినాష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలను దక్కించుకోవడమే కాకుండా పలు కార్యక్రమాలలో తన కామెడీ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
జీవితంలో ఇలా సెటిల్ అయిన తర్వాత అవినాష్ గతనెల ఇదే రోజున అనూజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
వివాహమైన తర్వాత తన భార్యతో కలిసి ఎన్నో వీడియోలను చేస్తూ యూట్యూబ్ ద్వారా అవినాష్ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా అవినాష్ సోషల్ మీడియా వేదికగా తన భార్య అనూజతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ మా పెళ్ళి జరిగి సరిగ్గా నెల అయింది అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా పెళ్ళి జరిగిన ఏడాదికి ప్రతి ఒక జంట పెళ్లి రోజును జరుపుకుంటారు.కానీ ప్రస్తుత కాలంలో నెలనెల బర్తడే వేడుకను పెళ్లి రోజులను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటే యానివర్సరీ అంటాము మరి నెలకు ఒకసారి జరుపుకుంటే మంత్సరీ అంటూ అవినాష్ చెప్పడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందించారు.ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ ఈ కొత్త పదం ఎక్కడి నుంచి కనుక్కున్నారన్న అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి అవినాష్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి ఒక నెల పూర్తి కావడంతో కొంత మందిన ఇతనికి శుభాకాంక్షలను తెలియజేశారు.ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం అవినాష్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమం ద్వారా తన కామెడీ స్కిట్ లతో ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు.