ఎన్టీఆర్ వీడియోకి ప్రకాష్ రాజ్ స్పందన..!

ఏపీ అసెంబ్లీలో అధికార పక్ష నేతలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించాయి.అసెంబ్లీ నుండి వాకవుట్ చేయడమే కాదు మళ్లీ వస్తే సి.

 Prakash Raj Comment About Ntr Special Video About Ap Issue, Prakash Raj , Ntr ,-TeluguStop.com

ఎం గానే అంటూ శపధం చేశారు చంద్రబాబు.అంతేకాదు రాజకీయాలు జోక్యం చేసుకోని భువనేశ్వరి గురించి మాట్లాడినందుకు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ విషయంపై నందమూరి ఫ్యామిలీ స్పందించిన విషయం తెలిసిందే.ఇదే విషయంపై రాజకీయాల్లోకి ఆడపడుచులను లాగడం అరాచక సంస్కృతి అని ఎన్.టి.ఆర్ కూడా స్పందించారు.

తారక్ స్పందన మీద విలక్షణ నటుడు.సోషల్ యాక్టివిస్ట్ ప్రకాష్ రాజ్ స్పందించారు.వెల్ సెడ్ డియర్ అంటూ ఎన్.టి.ఆర్ వీడియోకి కామెంట్ పెట్టారు ప్రకాష్ రాజ్.అయితే టీడీపీ అభిమానులు మాత్రం ఎన్.టి.ఆర్ ఇంకా ఫోర్స్ గా ఈ విషయాన్ని చెప్పాలని అంటున్నారు.ఓ పక్క కళ్యాణ్ రాం, నారా రోహిత్ కూడా ఈ విషయంపై తమ స్పందన తెలియచేశారు. ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్ లో ఉన్నారు.తిరిగి వచ్చాక మరోసారి ఈ విషయంపై స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సినిమాల మీదే ఫోకస్ పెట్టారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube