తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో ఆయన పోవే పోరా షో లో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ విష్ణు ప్రియ కి అందం, అభినయం నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
అలాగే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
కానీ ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలైనట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.
దీంతో ఈ మధ్యకాలంలో యాంకర్ విష్ణు ప్రియ ఒకపక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క హీరోయిన్ గా సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.దాంతో సోషల్ మీడియా మాధ్యమాలలో అవకాశాల కోసం అందాలు ఆరబోస్తూ తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే బోల్డు షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడనని చెప్పకనే చెబుతోంది ఈ బ్యూటీ.
అయితే తాజాగా యాంకర్ విష్ణు ప్రియ కి సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే యాంకర్ విష్ణుప్రియ చిన్నప్పుడు తన ఇంట్లో జరిగినటువంటి వేడుకలకు హాజరైన సమయంలో తీసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఈ ఫోటోని విష్ణుప్రియ అభిమాని ఇటీవలే బాలల దినోత్సవ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.అంతేకాకుండా ఈ ఫోటో పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ చిన్నప్పుడు విష్ణు ప్రియ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా విష్ణు ప్రియ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ చేస్తూ గ్లామర్ షో చేయడంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.అంతేకాకుండా అన్ని ఉన్నప్పటికీ అల్లుడు నోట్లో శని అన్నట్టు నటి విష్ణు ప్రియా కి కూడా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదని కనీసం ఇప్పటికైనా కొందరు దర్శక నిర్మాతలు గుర్తించి విష్ణు ప్రియ కి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడు పలు షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే అలరిస్తోంది.