రేవంత్ కు ఇక రానున్న రోజులు అగ్ని పరీక్షలా మారనున్నాయా?

ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మద్దతు పొందాలంటే కలిసికట్టుగా పోరాడాల్సి ఉంటుంది.లేకపోతే పార్టీలో ఐక్యత లేకపోతే ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంది.

 Will The Coming Days Be A Litmus Test For Rewanth?/revanth Reddy, Telangana Cong-TeluguStop.com

ఒక్క నాయకుడో, నాయకురాలో ప్రజలందరిని ప్రభావితం చేయలేరు.అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా బలపడాలంటే అందరూ కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో టీ ఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచి ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చుకోగలిగితేనే కాంగ్రెస్ టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ పార్టీగా సత్తా చాటే అవకాశం ఉంటుంది.

అయితే కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న సమస్య అంతర్గత వర్గ పోరు.ఆ కారణంగానే ఎంత మంది పీసీసీ చీఫ్ లు మారినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ లా మాత్రం మారలేకపోతోంది.

అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరిలో పోరాట పటిమ తగ్గిపోయి ఉన్న పరిస్థితి ఉంది.నాయకులు పోరాటం చేయకపోయినా కార్యకర్తలను ఉత్సాహపరిచేలా వర్గపోరును రూపుమాపి అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాడితే కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఇది సాటి నిఖార్సైన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల చిరకాల కోరిక.కాని ఈ సమస్యకు ఎప్పటికీ మాత్రం పరిష్కారం దొరకని పరిస్థితి ఉంది.

అయితే ఏది ఏమైనా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ అందరినీ కలుపుకు పోయి కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగాల్సిన కీలక సమయం.ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇక రానున్న రోజుల్లో ఇక రేవంత్ కు అగ్ని పరీక్ష అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పటిష్టతకు రేవంత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube