కిల్.. కిల్.. ఖిలాడి.. టైటిల్ సాంగ్ అదిరింది..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖిలాడి.

రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ కిల్ కిల్ ఖిలాడి సాంగ్ రిలీజైంది.దేవి మార్క్ మ్యూజిక్ తో ఈ సాంగ్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇక సాంగ్ లో రవితేజ డ్యాషింగ్ లుక్స్ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి.శ్రీమణి లిరిక్స్ అందించిన ఖిలాడి టైటిల్ సాంగ్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు.

క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ఖిలాడితో తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా కనిపిస్తాడని అంటున్నారు.

Advertisement

తప్పకుండా క్రాక్ తర్వాత మాస్ రాజా ఫ్యాన్స్ కు ఖిలాడి మాంచి కిక్ ఇస్తుందని అంటున్నారు.ఈ సినిమాతో పాటుగా రవితేజ శరత్ మండవ డైరక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమాతో పాటుగా టైగర్ నాగేశ్వర రావు సినిమా కూడా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఇదేకాకుండా సుధీర్ వర్మతో ఒక సినిమా.నక్కిన త్రినాథరావుతో మరో సినిమా లైన్ లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు