డ్రగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కి గురువారం బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా లీగల్ టీమ్ బెయిల్ పత్రాలను సమర్పించడంలో అలసత్వం చేసింది.దీంతో శుక్రవారం విడుదల కావాల్సిన ఆర్యన్ శనివారం విడుదలయ్యారు.
ఇక ఆర్యన్ ఖాన్ విడుదల కాబోతున్న ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లను చేశారు.ఈ క్రమంలోనే ఆర్యన్ జైలు నుంచి బయటకు రాగానే అభిమానులు వెల్కమ్ హోమ్ ఆర్యన్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు.
అలాగే ఆర్థర్ జైలు రోడ్ నుంచి మన్నత్ వరకు ఆర్యన్ ఖాన్ కోసం ప్రత్యేకంగా రహదారిని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే ఆర్యన్ రేంజ్ రోవర్ కారులో జైలు నుంచి ఇంటికి వెళ్తుండగా అభిమానులు కారు ముందు సెక్యూరిటీ గార్డులు పరుగులు పెట్టడం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ విడుదలకు సంబంధించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ వీడియోపై స్పందించిన పలువురు నెటిజన్లు ఆర్యన్ ఏదో ఒలంపిక్స్ మెడల్ సాధించినట్లు హంగామా చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆర్యన్ వీడియో విజువల్స్ పై సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే ఆర్యన్ విడుదలకు సంబంధించిన వీడియో పై స్పందిస్తూ.క్రైమ్ చేసినా కూడా మన దగ్గర డబ్బు, పవర్ ఉంటే క్రిమినల్స్ కూడా ఇలాగా అనుభవించవచ్చు ఇలా దేవుడిలా అతనికి స్వాగతం పలుకుతారు అంటూ చెప్పుకొచ్చారు.దేవుడా ఎట్టకేలకు ఆర్యన్ బయటకు వచ్చాడు అంటూ సాధన సింగ్ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన ఆర్యన్ పట్ల పలువురు తనకు మద్దతుగా నిలబడగా మరికొందరు ఆర్యన్ వ్యవహారశైలిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.