బిగ్ బాస్ 8 వ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ లో భాగంగా ఎన్నో గొడవలు అనంతరం షణ్ముఖ్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.
అయితే సన్నీ కెప్టెన్ గా ఉన్నప్పుడు తన ఎదుర్కొన్న అవమాన భారాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు.ఈ వారం నామినేషన్ కెప్టెన్సీ తేలిపోవడంతో వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనే విషయం గురించి హౌస్లో పెద్దఎత్తున చర్చలు జరిగాయి.
ఈ క్రమంలోనే షణ్ముక్ కెప్టెన్ అయినప్పటికీ అతని మాత్రం సిరి జెస్సీ లతో కలిసి మోజ్ రూమ్లో ముచ్చట్లు పెడుతున్నాడు.
ఇక మానస్, సన్నీ బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ బుక్ తీసి రూల్స్ చదువుతూ సంచాలకుడిగా ఉన్నటువంటి జెస్సీ జడ్జిమెంట్ బాగా లేదని తెలియజేశారు.
ఇదే విషయాన్ని రవి వారి దగ్గరికి వెళ్లి చెప్పడంతో చదివితే చదువుకోనీవ్వు నువ్వు కెప్టెన్ అవ్వడం వారికి నచ్చలేదంటూ సిరి కామెంట్ చేస్తుంది.ఇలా కెప్టెన్ గురించి పలు రకాలుగా చర్చలు జరిగిన అనంతరం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనే విషయం గురించి చర్చలు జరిగాయి.

ఈ క్రమంలోనే ఎవరికివారు వరెస్ట్ పర్ఫార్మర్ ని ఎంపిక చేసుకున్నారు.అయితే సిరి వరస్ట్ పర్ఫార్మర్ గా సన్నీని ఎంపిక చేసుకుంది.అలా సన్నీని వరెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పడానికి కారణం ఏమిటంటే అంటూ సంచాలకుడు జేస్సితో సన్నీ వ్యవహరించిన తీరు బాగాలేదని అందుకే తనని వరెస్ట్ పెర్ఫార్మర్ గా నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే సన్నీ మాట్లాడుతూ నువ్వు కత్తి పట్టుకుని గేమ్లో గెలవాలని చూసావు అంటూ తన కన్నింగ్ గేమ్ పై సన్నీఆగ్రహం వ్యక్తం చేస్తూ అది మంచి బిహేవియర్ అని అడగడంతో సిరి నువ్వు నన్ను వరెస్ట్ పెర్ఫార్మర్ గా నామినేట్ చేసుకో అంటూ అతనికి కౌంటర్ వేసింది.
ఇలా మొత్తానికి హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లలో సన్నీ, కాజల్ ను ముగ్గురు వరెస్ట్ పెర్ఫార్మర్ గా నామినేట్ చేయడంతో వీరిద్దరికీ టై ఏర్పడింది.దీంతో కెప్టెన్ షణ్ముఖ్ సన్నీనీ వరస్ట్ ఫార్మర్ గా నామినేట్ చేయడంతో సన్నీ జైలుకు వెళ్లాడు.