సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది.స్పెయిన్ లో సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు.
రెండు మూడు రోజుల్లో అక్కడ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది.ఆ వెంటనే వారం పది రోజుల గ్యాప్ తీసుకుని చివరి దైన హైదరాబాద్ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు.
హైదరాబాద్ లో ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఒక భారీ సెటింగ్ ను వేయడం జరిగింది.ప్రస్తుతం చిత్రీకరణ స్పెయిన్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇక ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రకటించారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల విషయంలో మార్పు లు రాబోతున్నాయి.
సంక్రాంతి కి ఇతర సినిమా లు ఉండటంతో పాటు మరి కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ను సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో విడుదల చేసే ఉద్దేశ్యంతోనే పాట విడుదల విషయంలో జాప్యం చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.లేదంటే ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన ఒకటి రెండు పాటలను థమన్ మెల్ల మెల్లగా వదిలేవాడు.థమన్ అందించిన పాటల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా ఈ సినిమా పాటలు విడుదల చేస్తామంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.
దాంతో సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ పూర్తి అయినా కూడా కాస్త ఆలస్యంగానే సినిమా ను విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తుంది.మొత్తానికి సర్కారు వారి పాట విడుదల విషయంలో సస్పెన్స్ కు కాస్త తెర పడ్డట్లుగా అనిపించినా పూర్తిగా ఈ సందిగ్దం తొలగి పోవాలంటే మాత్రం ఖచ్చితంగా యూనిట్ సభ్యులు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.