టాలీవుడ్ యంగ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది.ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తన ఇంటికి వెళ్లగా తనకు మరికొంత కాలం రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపినట్లు తెలిసింది.
అంతేకాకుండా కొన్ని ఫిజియోథెరపీ సేవలు కూడా అందించాలని వైద్యులు తెలిపారట.
గత నెల హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పై సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తుండగా బైక్ స్కిడ్ అవడంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు.
దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేర్చగా ఆ తర్వాత అపోలో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.ఇక దాదాపు నెల రోజులకు ఎక్కువగానే సాయి ధరమ్ తేజ్ కు చికిత్స అందించారు.

దీంతో ఈ మధ్య తను కాస్త కోలుకోవడంతో ఈ రోజు ఉదయాన్నే డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది.ఇక ఇటీవలే ఈయన నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఒక నెలరోజుల వరకు సాయి ధరమ్ తేజ్ కు విశ్రాంతి అవసరమని ఆ తర్వాతనే సినిమా షూటింగులకు హాజరవుతాడని తెలిసింది.ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు తాను కోలుకున్నట్టు పోస్ట్ చేయగా తన అభిమానులు ఆయన పోస్టుకు స్పందించారు.