అరుదైన రికార్డ్ నెల‌కొల్పిన ముకేశ్ అంబానీ.. ఆ లిస్టులో చోటు

ఇండియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా కొన‌సాగుతున్న ముఖేశ్ అంబానీ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.ఆయ‌న ప్ర‌తి ఏడు త‌న సంప‌ద‌ను పెంచుకుంటూ మ‌రింత ఎత్తుకు ఎదుగుతున్నారు.

 Mukesh Ambani Who Has Set A Rare Record Has A Place In That List , Mukesh Ambani-TeluguStop.com

ఇప్ప‌టికే త‌న సంద‌ప‌ద‌ను పెంచుకుంటూ ఎన్నో రికార్డులు నెల‌కొల్పుతున్నారు మేఖేశ్ అంబానీ.భారత దేశంలో ఆయ‌న‌కు తప్ప మ‌రెవ‌రికీ సాధ్యం కానంత రీతిలో ఈ ఆసియా కుబేరుడు బిజినెస్ మెల‌కువ‌ల‌ను మారుస్తున్నారు.నిజంగా చెప్పాలంటే ఒక ట్రెండ్‌ను సెట్ చేస్తూ దూసుకుపోతున్నారు.ఆయ‌న అధినేత‌గా ఉన్న‌టువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ఒక ఆకాశ ప‌థాన న‌డిపిస్తున్నారు.

కాగా ఇప్పుడు ఆయ‌న మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.ఇప్ప‌టి దాకా ప్రపంచ వ్యాప్తంగా వంద బిలియన్ డాల‌ర్లు ఉన్న వారు చాలా కొద్ది మంది మాత్ర‌మే ఉన్నారు.

అలాంటి వారి లిస్టులో ముఖేష్ చోటు సంపాదించారు.నిజానికి వంద బిలియ‌న్ డాల‌ర్లు అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో రూ.7.50లక్షల కోట్లు అన్న‌మాట‌.ఇంత ఆస్తి ఉన్న వారు ఇప్ప‌టి దాకా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హా అయితే ఒక 12 మంది ఉంటారు కావ‌చ్చు.ఇప్పుడు ఇలాంటి జాబితాలో అంబానీ స్థానం ద‌క్కించుకున్నారు.

తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైం ఈ బిలియ‌నీర్ల లిస్టును అనౌన్స్ చేసింది.

Telugu Mukesh Ambani, Rare-Latest News - Telugu

దీని ప్ర‌క‌రాం ముకేశ్ అంబానీ ఆస్తి 10,100 కోట్ల డాలర్లుగా ఉంద‌ని అంచ‌నా.ఈ నెట్ వ‌ర్త్ కార‌ణంగా ఆయ‌న 100 బిలియన్ డాలర్లు ఉన్న బిజినెస్ ప‌ర్స‌న్ల లిస్టులో చేరిపోయారు.నిజానికి కరోనా స‌మ‌యంలో చాలామంది వ్యాపార‌స్తులు తీవ్రంగా న‌ష్ట‌పోయి ర్యాంకులు పోగొట్టుకున్నారు.

కానీ ముకేశ్ అంబానీ మాత్రం వారంద‌రికీ భిన్నంగా త‌న సంప‌ద‌ను పెంచుకున్నారు.కేవ‌లం ఈ ఏడాది లోనే ఆయ‌న సంప‌ద రూ.2380 కోట్ల డాల‌ర్లకు పెరిగింద‌ని చెబుతున్నారు.ఇక ఈ బిలియ‌నీర్ జాబితాలో పదకొండు మంది ఉంటే ఇంద‌లో ముకేశ్ పదకొండో స్థానంలో ఉన్నార‌ని స‌మాచారం.

ఇక ఎలాన్ మస్క్ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో కొన‌సాగుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube